కర్నూలు జిల్లా శ్రీశైలం వద్ద గల హఠకేశ్వరం మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును జీపు ఢీకొట్టడంతో శని తెల్లవారు జామున ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడిక్కడే మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఏపీ04జెడ్0278 నెంబరు గల ఆర్టీసీ బస్సు, ఏపీ 3వీ4644 నెంబరు గల జీపును పాలదార-పంచదార సమీపంలో ఢీకొట్టింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా పేర్కొన్నారు. ప్రమాదంలో మృతిచెందిన వారిని సున్నిపెంటకు చెందిన మల్లేశ్వరి, శంకరమ్మగా గుర్తించారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.