బంగారు ఆభరణాలు, వజ్రాల పథకాలతో పాటు తదితర స్కీములతో దేశ విదేశాల్లో రూ. 100 కోట్లు స్వాహా చేసినట్లుగా హీరా గ్రూప్స్ ఎండీ నౌహీరా షేక్ కి నాంపల్లిలో కోర్టులో తాత్కాలిక ఊరట లభించింది.. నౌహీరాను కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తామని పోలీసులు పిటిషన్ వేయగా బుధవారం నాంపల్లి కోర్టులో విచారణకు వచ్చింది. దీంతో బాధితులు, పోలీసుల తరుఫున వాదనలతో సంతృప్తి చెందని కోర్టు నౌహీరాకు బెయిల్ మంజూరు చేసింది. ఇందుకుగాను వ్యక్తిగత పూచీకత్తుతో పాటు రూ. 5 లక్షల విలువైన రెండు సెక్యూరిటీ బాండ్లను కోర్టుకు సమర్పించాలని పేర్కొంది. ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి ఎక్కడికి వెళ్లొదంటూ ఆదేశించింది.
వందల సంఖ్యలోని నౌహీరా బాధితులు గురించి పోలీసులు సరైన చర్యలు తీసుకోవడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
హీరా గ్రూప్స్ అధినేతకు తాత్కాలిక ఊరట… బాధితుల ఆందోళన
-