కొద్ది రోజుల క్రితం గర్భంతో ఉన్న ఏనుగు కేరళలో మరణించిన సమయంలో చాలా మంది కన్నీళ్లు పెట్టుకున్నారు. చాలా మంది ఇంట్లో ఆడపిల్ల మరణించిన విధంగానే బాధ పడిన సందర్భం అది. ఇప్పుడు అదే కేరళలో మరో విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. చాలా మంది ఏనుగు ఘటన చూసి బాధ పడ్డారు. అసలు కేరళలో వంద శాతం విద్య ఉంటుంది అంటారు కదా ఇలా ఎలా ప్రవర్తిస్తారు అన్నారు.
ఇప్పుడు మళ్ళీ కేరళలో ఒక ఆందోళనకర విషయం బయటకు వచ్చింది. త్రిస్సూర్ జిల్లాకు చెందిన ఒల్లూర్‌లో మూతి చుట్టూ ఇన్సులేషన్ టేప్ చుట్టి నిర్మానుష్యంగా ఉన్న షెటర్ ఎదుట గొలుసుతో ఒక కుక్కను కట్టేశారు. అది అరవకుండా చేయడానికి గానూ ఈ విధంగా ప్రవర్తించారు కొందరు ప్రబుద్దులు. ఇలా దీనంగా పడి ఉన్న కుక్కను చూసిన ‘పీపుల్ ఫర్ యానిమల్ వెల్ఫేర్’ సభ్యులు చేరదీసారు.
కొన్నాళ్ల నుంచి ఆ శునకానికి ఆహారం, నీరు లేదు అని వారు గుర్తించారు. దీనితో అది చాలా నీరసంగా ఉంది. రెండు వారాల క్రితం దానిని ఆ విధంగా బంధించారు అని పేర్కొన్నారు. వెంటనే ఆ టేప్ ని కత్తిరించారు. వెంటనే ఆహారం అందించే ఏర్పాట్లు కూడా చేసి… వైద్యం అందించి యానిమల్ షెల్టర్ హోంకు తరలించారు. అక్కడ కూడా దానికి వాళ్ళు చికిత్స చేస్తున్నారు. దాని ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది.