బియ్యపు పిండిని చీమలకు ఆహారంగా పెడితే ఈ రాశివారికి అంతా శుభమే! మార్చి 11 రాశి ఫలాలు

8

మార్చి 11 సోమవారం – రోజువారి రాశి ఫలాలు

మేషరాశి: ప్రతికూలం. బంధువుల రాక, భాగస్వాములతో విభేదాలు, చెడు ఆలోచనలు, పనుల్లో జాప్యం.
పరిహారాలు: బియ్యపు పిండిని చీమలకు ఆహారంగా వేయండి మంచి చేస్తుంది.

వృషభరాశి: అనుకూల ఫలితాలు, విందులు, కార్యజయం, లాభం.
పరిహారాలు: శివాభిషేకం, గోసేవ చేయండి మంచిది.

మిథునరాశి: మంచి రోజు. కార్యజయం, లాభం, కుటుంబంలో సంతోషం, పనులు పూర్తి.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, గోసేవ/తులసీ పూజ మంచి చేస్తుంది.

కర్కాటకరాశి: ప్రతికూలం. పనుల్లో జాప్యం. కుటుంబంలో చిన్న సమస్యలు, అలసట.
పరిహారాలు: బియ్యపు పిండిని చీమలకు ఆహారంగా పెట్టండి మంచి జరుగుతుంది.

సింహరాశి: మిశ్రమం. పనులు వేగంగా పూర్తి, ధననష్టం,మనఃశాంతి ఉండదు.
పరిహారాలు: శివపూజ/అభిషేకం లేదా దేవాలయ ప్రదక్షణలు చేయండి.

కన్యారాశి: అనుకూలం, వ్యవహారాలు కలిసి వస్తాయి, కుటుంబంలో సంతోషం. లాభం.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, దేవనామస్మరణ మంచిచేస్తుంది.

తులారాశి: ప్రతికూలం. కార్యనష్టం, వస్తు నష్టం, విరోధాలు.
పరిహారాలు: శివనామ స్మరణ, మారేడుతో శివపూజ మంచి ఫలితాలు ఉంటాయి.

వృశ్చికరాశి: మిశ్రమం, లాభం, సంతోషం, అనుకోని ఘటనలు జరుగుతాయి.
పరిహారాలు: తెల్లపూలతో శివునికి పూజ లేదా వేంకటేశ్వరస్వామి అర్చన చేయండి.

ధనస్సురాశి: మిశ్రమం. పనులు పూర్తి, విరోధాలు, వస్తువులను అమ్ముతారు. చిన్నచిన్న సమస్యలు.
పరిహారాలు: శివపూజ/వేంకటేశ్వరస్వామి దేవాలయ దర్శన మంచిచేస్తుంది లేదా ఇంట్లో ఆయా దేవతలకు నమస్కారం, ధ్యానం చేయండి.

మకరరాశి: మిశ్రమం. లాభం, చెడ్డవారితో స్నేహం, ధననష్టం, ప్రయాణ సూచన.
పరిహారాలు: దగ్గర్లోని దేవాలయాన్ని దర్శించి ప్రదక్షణలు చేయండి. ఎవరికైనా సహాయం చేయండి.

కుంభరాశి: ప్రతికూలం. అనుకోని ఘటనలు, ఆందోళన, మనోవ్యధ.
పరిహారాలు: వేంకటేశ్వరఆరాధన, గోసేవ లేదా పేదలకు సహాయం మంచి ఫలితాలను ఇస్తుంది.

మీనరాశి: అనుకూలం. ధనలాభం, సంతోషం, కళత్రసుఖం, పనులు పూర్తి.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, గోసేవ చేయండి.

నోట్- పేదలకు సహాయం చేయడం అంటే మీ శక్తిమేరకు సహాయం, రొట్టెలను ఇవ్వడం అంటే మీ ఇంట్లో లేదా హోటల్‌లో శుభ్రమైనవి, అప్పుడే తయారుచేసినవి ఇవ్వండి. వాటితోపాటు శుభ్రమైన నీటిని ఒక బాటిల్‌లో పోసి ఇస్తే ఇంకా మంచిది. ఏ దానమైన, సహాయం చేసినా మీ శక్తిమేరకు చేయండి. ఆర్భాటాలు చేయకండి. దానం గుప్తంగా చేస్తేనే ఫలితం శ్రీఘంగా, శుభకరంగా ఉంటుంది.
ఓం నమో వేంకటేశాయనమః

– కేశవ

amazon ad