మరోవైపు ఏపీ డేటా చోరీ కేసు కూడా చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్ మెడకు చుట్టుకోవడంతో.. దాని నుంచి ఇంకా బయటపడకముందే… ఎన్నికలు భయపెడుతున్నాయి.
కేంద్ర ఎన్నికల సంఘం ఒకేసారి పెద్ద బాంబు పేల్చింది. ఏపీలో ఎన్నికలను తొలి విడుతలోనే పెట్టేసింది. దీంతో ఏపీ సీఎం చంద్రబాబుకు టెన్షన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే.. ఇప్పటి వరకు చంద్రబాబు అటు అసెంబ్లీ అభ్యర్థులను, ఇటు లోక్‌సభ అభ్యర్థులను ఖరారు చేసుకోలేదు. ఇంతలోనే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ రిలీజ్ చేసినా.. మరో రెండు నెలల సమయం ఉంటుందిలే… నెమ్మదిగా అభ్యర్థులను ప్రకటించొచ్చు.. అనుకున్నారు చంద్రబాబు. కానీ.. కేవలం నెల రోజుల సమయంలోనే ఏపీలో ఎన్నికలు జరగనుండటంతో చంద్రబాబుకు ఏం చేయాలో పాలుపోవడం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఏప్రిల్ 11న పోలింగ్ అంటే ఈరోజు నుంచి సరిగ్గా నెలరోజుల సమయం. మరో వైపు జగన్ చాలా బలంగా ఉన్నారు. ఆయన ఇప్పటికే 21 మంది లోక్ సభ అభ్యర్థులను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ అభ్యర్థుల లిస్ట్ కూడా జగన్ ఎప్పుడో తయారు చేసి పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఈనెల రోజుల్లోనే అభ్యర్థుల్ని ఎంపిక చేసి.. మేనిఫెస్టోను ప్రకటించాల్సి ఉండటంతో చంద్రబాబుకు ఇవన్నీ కత్తి మీద సాము అయిపోయాయని చెబుతున్నారు.
మరోవైపు ఏపీ డేటా చోరీ కేసు కూడా చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్ మెడకు చుట్టుకోవడంతో.. దాని నుంచి ఇంకా బయటపడకముందే… ఎన్నికలు భయపెడుతున్నాయి. ఇప్పటికే చంద్రబాబు.. అభ్యర్థుల లిస్ట్ తయారు చేశారని తెలుస్తున్నా.. అందులో చాలామందిని మార్చాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. దీంతో వచ్చే ఎన్నికలకు అనుగుణంగా వెంటనే రంగం సిద్ధం చేసుకొని.. వెంట వెంటనే అభ్యర్థులను ప్రకటించి.. ప్రచారాన్ని ముమ్మరం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.
అయితే.. చంద్రబాబుపై మొదటి నుంచీ ఏపీ ప్రజల్లో నమ్మకం పోయింది. గత ఐదేళ్ల కాలంలో ఏపీని ఏమాత్రం అభివృద్ధి చేయలేదని.. ఆయన కేవలం డబ్బు సంపాదన మీదనే పడ్డారని.. గత ఐదేళ్ల కాలంలోనే చంద్రబాబు ఆస్తులు, ఆయన కొడుకు ఆస్తులు రెట్టింపు అయ్యాయని.. ఏపీ అభివృద్ధిని పట్టించుకోని చంద్రబాబును ఈసారి ఓడించడమేనని ఏపీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఏపీని అభివృద్ధి చేసే సత్తా ఉన్నా జగన్‌కే తమ ఓటు అని.. ఈసారి జగనే సీఎం అంటూ ఏపీ ప్రజలు స్పష్టం చేస్తున్నట్టు తెలుస్తోంది.