మార్చి 12 మంగళవారం – రోజువారి రాశిఫలాలు
మేషరాశి –ప్రతికూలం. అన్నింటా వ్యతిరేక ఫలితాలు, వివాదాలు, అనవసర ఖర్చు.
పరిహారాలు- ఎర్రవత్తులతో నవగ్రహాల దగ్గర దీపారాధన లేదా ఇంట్లో దేవుని దగ్గరైనా చేయండి చెడు ఫలితాల తీవ్రత తగ్గుతుంది.
వృషభరాశి-అనుకూల ఫలితాలు, లాభం, వస్తులాభం, సోదర, సోదరీ సహకారం.
పరిహారాలు- ఇష్టదేవతరాధన, దేవనామస్మరణ చేయండి మంచి జరుగుతుంది.
మిథునరాశి-మిశ్రమం. చిన్నచిన్న సమస్యలు, విందులు, వినోదాలు, పక్కవారితో విభేదాలు.
పరిహారాలు- పేదలకు గోధుమ రొట్టెలను పంచి పెట్టండి మీకు మేలు జరుగుతుంది.
కర్కాటకరాశి-మిశ్రమం. బంధువుల సహకారం, ధనవ్యయం, అనవసర ఖర్చు, అలసట.
పరిహారాలు- ఇష్టదేవతారాధన, గోసేవ చేయండి మంచి జరుగుతుంది.
సింహరాశి-ప్రతికూలం. కలహాలు, విరోధాలు, అనారోగ్యం, పనుల్లో జాప్యం.
పరిహారాలు- వేంకటేశ్వరస్వామి ఆరాధన/గోవిందనామాలు మంచి చేస్తాయి.
కన్యారాశి-అనుకూలం, లాభం, వ్యవహార జయం, కార్యాలు పూర్తి, విందులు.
పరిహారాలు- ఎర్రవత్తులతో ఇంట్లో దేవుని ముందు దీపారాధనచేయండి మంచిది.
తులారాశి-ప్రతికూలం. చెడువార్తా శ్రవణం, ప్రయాణాల్లో ఇబ్బందులు.
పరిహారాలు- ఎర్రవత్తులతో అమ్మవారికి దీపారాధన చేయండి.
వృశ్చికరాశి-అనుకూలం. కార్యజయం, బంధువుల రాక, సహకారం, పనులు పూర్తి.
పరిహారాలు- ఎర్రపూలతో అమ్మవారి అర్చన మంచిచేస్తుంది.
ధనస్సురాశి-అనుకూలం. అరోగ్యం, పనులు పూర్తి, పరిచయాలు, లాభం.
పరిహారాలు- ఇష్టదేవతరాధన, గోసేవ మంచిది.
మకరరాశి-ప్రతికూలం. వస్తునష్టం, కార్యనష్టం, అనుకోని ఖర్చులు.
పరిహారాలు-ఎర్రపూలతో పూజ, ఎర్రవత్తులతో దీపారాధన మంచిచేస్తుంది.
కుంభరాశి- ప్రతికూలం. విభేదాలు, ధనవ్యయం, అనుకోని ఖర్చులు.
మీనరాశి -అనుకూలమైన రోజు, కార్యలాభం, వస్తులాభం, పనులు పూర్తి.
పరిహారాలు-ఇష్టదేవతరాధన, పేదలక సహాయం చేయడం భవిష్యత్‌కు ఉపయోగం మంచి చేస్తుంది.
నోట్- పేదలకు సహాయం చేయడం అంటే మీ శక్తిమేరకు సహాయం, రొట్టెలను ఇవ్వడం అంటే మీ ఇంట్లో లేదా హోటల్‌లో శుభ్రమైనవి, అప్పుడే తయారుచేసినవి ఇవ్వండి. వాటితోపాటు శుభ్రమైన నీటిని ఒక బాటిల్‌లో పోసి ఇస్తే ఇంకా మంచిది. ఏ దానమైన, సహాయం చేసినా మీ శక్తిమేరకు చేయండి. ఆర్భాటాలు చేయకండి. దానం గుప్తంగా చేస్తేనే ఫలితం శ్రీఘంగా, శుభకరంగా ఉంటుంది.
ఓం నమో వేంకటేశాయనమః
– కేశవ