మార్చి 18 సోమవారం – రోజువారి రాశిఫలాలు
మేషరాశి: అనుకూల ఫలితాలు, శుభకార్య సూచన, భార్యతో కలిసి ప్రయాణం, పనులు పూర్తి.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, శివాభిషేకం చేసుకోండి మంచిది.
వృషభరాశి: ప్రతికూలం. ధనవ్యయం, ఆనారోగ్యం, వాప్యారంలో ఇబ్బందులు.
పరిహారాలు: పారేనీటిలో కొబ్బరికాయను వేసి ఓం నమో నారాయణాయనమః లేదా ఓం నమో విష్ణవేనమః అని పదకొండుసార్లు మనస్సులో ధ్యానం చేసుకోండి ఇబ్బందులు దూరమవుతాయి. ఇది వీలుకాకుంటే గోవులకు దానా తినిపించండి.
మిథునరాశి: మిశ్రమ ఫలితాలు, స్త్రీ మూలక ధనలాభం, అలసట, అధికశ్రమ, విందులు.
పరిహారాలు: శివునికి అభిషేకం లేదా శివస్తోత్రపారాయణం చేసుకోండి.
కర్కాటకరాశి: మిశ్రమ ఫలితాలు, అధికారుల కలయిక, విందులు, వినోదాలు, ధనవ్యయం, ఇంట్లోవారి వల్ల నష్టం.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, ఇంట్లో నెయ్యిదీపం పెట్టి బయటకు వెళ్లండి.
సింహరాశి: మంచిరోజు, విందులు, పనులు పూర్తి, ప్రయాణం, మిత్రుల కలయిక.
పరిహారాలు: శివపూజలో మారేడుదళాలతో అర్చించండి.
కన్యారాశి: అన్నింటా వ్యతిరేక ఫలితాలు, మాటపట్టింపులు, విరోధాలు, ధనవ్యయం.
పరిహారాలు: పారేనీటిలో కొబ్బరికాయను వేయండి. వేసే సమయంలో ఓం నమో విష్ణువేనమః లేదా ఓం నమో వేంకటేశ్వరాయనమః అని 11 సార్లు పఠించండి. దోషాల తీవ్రత తగ్గి మంచి జరుగుతుంది.
తులారాశి: మిశ్రమంగా ఉండును, ఇంట్లో శుభకార్య సూచన, సోదర, సోదరీలు ఇంటికిరాక, పనులు వాయిదా, అలసట.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, నవగ్రహాలకు ప్రదక్షణలు చేయండి.
వృశ్చికరాశి: మంచి జరుగుతుంది. పనులు పూర్తి, భూ సమస్యలు పరిష్కారం.
పరిహారాలు: తెల్లపూలతో శివుని పూజ లేదా తెల్లజిల్లేడుతో పూజ మంచి చేస్తుంది.
ధనస్సురాశి: మంచిరోజు, విందులు, స్నేహితుల కలయిక, లాభం, ప్రయాణ సూచన.
పరిహారాలు: విష్ణుపూజ లేదా పారాయణం లేదా శివారాధన చేసుకోండి.
మకరరాశి: వ్యతిరేక ఫలితాలు, పనుల్లో ఆటంకాలు, వాహన ప్రమాదం, ధననష్టం.
పరిహారాలు: శివాభిషేకం/నవగ్రహాలకు రంగురంగుపూలను సమర్పించండి.
కుంభరాశి: అనుకున్నవి పూర్తి, లాభం, జయం, అలసట, శ్రమ అయినా ఇబ్బంది ఉండదు.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, గోసేవ చేసుకోండి మంచిది.
మీనరాశి: ప్రతిపనిలో జయం, లాభం, కార్యలాభం, ఉల్లాసం, ఉత్సాహం.
పరిహారాలు: శివారాధన, స్తోత్రపారాయణం లేదా శ్రవణం చేయండి.
– కేశవ