జూన్ 22 రాశి ఫలాలు: దేవాలయ దర్శనం ఈరాశులకు మంచి ఫలితాలు ఇస్తుంది..!

జూన్ 22 శనివారం రోజువారి రాశిఫలాలు

మేషరాశి: ఒత్తిడి, స్నేహితులు ఆర్థికంగా ఆసరా అవుతారు, సంతోషం, ప్రత్యేక గుర్తింపు, వివాహితులకు ప్రతికూలం, చేసే పనిలో ఆనందం, కుటుంబ సఖ్యత.
పరిహారాలు: త్రుణధాన్యాలను దేవునికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకోండి.

వృషభరాశి: ఔట్‌డోర్ క్రీడలు మిముల్ని ఆకర్షిస్తాయి, గ్రహస్థ జీవితం ప్రశాంతంగా ఉంటుంది, ధ్యానం, యోగా ప్రయోజనకరంగా ఉంటుంది, కుటుంబ సఖ్యత, ఆర్థికంగా బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది.
పరిహారాలు: ఇష్టదేవతరాధన చేసుకోండి సరిపోతుంది.

మిథునరాశి: అంతులేని విశ్వాసం, రిలాక్స్, శుభవార్తా శ్రవణం, వైవాహిక జీవితంలో ఇబ్బందులు, ఆర్థికంగా బాగుంటుంది, ఆరోగ్యం, కుటుంబ సఖ్యత.
పరిహారాలు: ఇష్టదేవతరాధన చేయండి మంచి జరుగుతుంది.

కర్కాటకరాశి: విచారాన్ని తరిమివేయండి, కుటుంబ వేడుకలు, కొత్త స్నేహితులు, ప్రయాణాలు కలసివస్తాయి, మంచి రోజు అత్యుత్తమంగా ఉపయోగించుకోండి.
పరిహారాలు: ఏ రోజు యాలకులను దేవునికి ప్రసాదంగా పెట్టి స్వీకరించండి మంచి జరుగుతుంది.

సింహరాశి: వ్యక్తిత్వాన్ని మెరుగుపర్చుకోవడానికి ప్రయత్నించండి, దూరప్రాంత బంధువుల కలయిక, ఖర్చులు పెరుగుతాయి.
పరిహారాలు: పాలను దేవునికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించండి.

కన్యారాశి: నుకూల ఆలోచనలు చేయండి, సామాజిక కార్యక్రమం, ఆధ్యాత్మిక గురువును కలవండి, భాగస్వామితో ఆనందం, కుటుంబంలో సంతోషం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన చేసుకోండి.

తులారాశి: ఆశావహ ఆలోచనలతో ఉండండి, భయం, అసహ్యత వంటివాటిని దరిచేరనీయకండి, కుటుంబంలో ఇబ్బందులు, ఆరోగ్యం బాగుంటుంది, ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది.
పరిహారాలు: శివలింగానికి అభిషేకం చేయండి మంచి ఫలితం వస్తుంది.

వృశ్చికరాశి: వృత్తిలో నైపుణ్యానికి పరీక్ష., ఏకాగ్రతతో పనిచేయండి, గతంలో మీరుపడ్డ కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది, కుటుంబ సంతోషం, ఆరోగ్యం, ఆర్థికంగా బాగుంటుంది. భాగస్వామితో ఆనందం.
పరిహారాలు: తెల్లదుస్తులను ధరించండి మంచి జరుగుతుంది.

ధనస్సురాశి: వేగవంతమైన స్వభావం మిముల్ని లక్ష్యం వైపు నడిపిస్తాయి, కాలంతోపాటు ఆలోచనలు మార్చుకోండి, కుటుంబ ఆనందం, సంపద, ఆరోగ్యం బాగుంటాయి, వృత్తిలో మంచి మార్పులు.
పరిహారాలు: గంధాన్ని ధరించండి తప్పక మంచి ఫలితం వస్తుంది.

మకరరాశి: నమ్మకం, శక్తి ఎక్కువగా ఉంటాయి, డబ్బు సంపాదించాలన్న కోరిక ఎక్కువగా ఉంటుంది, కుటుంబ ఆనందం, ఆర్థికంగా బాగుంటుంది, వృత్తిలో ఆనందం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన చేయండి.

కుంభరాశి: చిరకాల మిత్రుడు కలయిక, బాకీలు వసూలు, ఆర్థికంగా బాగుంటుంది, కుటుంబ సంతోషం, శుభవార్తా శ్రవణం సంతోషాన్ని కలిగిస్తుంది.
పరిహారాలు: దేవాలయ దర్శనం మంచిది.

మీనరాశి: వ్యాయామాలు చేయండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ఆర్థికంగా బాగుంటుంది, కుటుంబ సంతోషం, వృత్తిలో ఇబ్బందులు.
పరిహారాలు: దేవాలయ దర్శనం, ప్రదక్షణలు చేయండి.

– కేశవ