మే 4 శనివారం – రోజువారి రాశిఫలాలు
మేషరాశి: ప్రతికూలం. అధిక ఖర్చులు, అధిక శ్రమ, పనుల్లో జాప్యం, ఆనారోగ్య సూచన, వాహనాలతో జాగ్రత్త, స్టాక్‌మార్కెట్లు కలిసిరావు.
పరిహారం: పిత్రు దేవతలకు పూజ లేదా వారి పేరుమీద అన్నదానం చేయండి మంచి ఫలితాలు ఉంటాయి.
వృషభరాశి: ప్రతికూల ఫలితాలు, సోదర కలహం, చికాకు, నష్టం, తల్లికి అనారోగ్య సూచన, ఆర్థికంగా కొంత ఇబ్బందులు.
పరిహారం: పెద్దల పేరుమీద అమావాస్య నాడు బియ్యం దానం చేస్తే మంచి ఫలితాలు.
మిథునరాశి: ఉత్సాహం, కలహం, అధిక శ్రమ, వస్తులాభం, పనులు అనుకూలిస్తాయి. కుటుంబ సఖ్యత.
పరిహారం: ఇష్టదేవతరాధన, సింధూరధారణ మంచి చేస్తుంది.
కర్కాటకరాశి: పనులు పూర్తి, అన్నింటా అనుకూలం, ఆర్థికంగా బాగుంటుంది, కొత్త స్త్రీల పరిచయం, కుటుంబ సఖ్యత.
పరిహారం: వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రదక్షిణలు మంచి ఫలితాన్నిస్తాయి.
సింహరాశి: ఇబ్బందులు, పనుల్లో ఆటంకాలు, పనిచేసే చోట ఒత్తిడి, ఆర్థికంగా పర్వాలేదు. బంధువుల రాక.
పరిహారం: అమావాస్య ఈరోజు పెద్దల పేరుతో పేదలకు సహాయం చేయండి పిత్రు దేవతల ఆశీస్సులతో మంచి జరుగుతుంది.
కన్యారాశి: పనులు పూర్తి, స్వల్ప బేధాలు, విందులు, ప్రయాణ సూచన, ఆరోగ్యం, ఆర్థికంగా పర్వాలేదు.
పరిహారం: వేంకటేశ్వరస్వామికి అర్చన మంచి ఫలితానిస్తుంది.
తులారాశి: బంధువుల రాక, కుటుంబ సంతోషం, పనులు పూర్తి, ఇష్టమైన వార్తలు వింటారు. ఆరోగ్యం.
పరిహారం: నవగ్రహాలకు దీపారాధన మంచి ఫలితం వస్తుంది.
వృశ్చికరాశి: బంధుమిత్రుల రాక, తగాదాలు, విందులు, అనవసర ఖర్చులు, ఆర్థికంగా ఇబ్బందులు, కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు.
పరిహారం: వేంకటేశ్వరస్వామికి తులసీమాల సమర్పణ చేయండి.
ధనస్సురాశి: ఇబ్బందులు, కీర్తినష్టం, వాహనాలతో ఇబ్బందులు, ఆనారోగ్యం.
పరిహారం: నవగ్రహాల వద్ద దీపారాధన చేయండి.
మకరరాశి: అనుకూలం, ధనలాభం, స్త్రీమూలక లాభం, వ్యవహార జయం, పనులు పూర్తి
పరిహారం: ఇష్టదేవతరాధన చేయండి
కుంభరాశి: కార్యజయం, అన్నింటా జయం, ధనలాభం, ఆరోగ్యం, కుటుంబ సఖ్యత.
పరిహారం: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి.
మీనరాశి: మిశ్రమ ఫలితాలు, వ్యసనాల వల్ల ఖర్చులు, ధననష్టం, ఆరోగ్యం, కుటంబంలో అపార్థాలు.
పరిహారం: వేంకటేశ్వరస్వామికి అర్చన, తులసీమాల సమర్పణ చేయండి.
– కేశవ