మహేశ్ థియేటర్‌లో అవేంజర్స్ సినిమా చూసిన జగన్.. ఇది ఎండ్ గేమ్ కాదంటూ చంద్రబాబు పంచ్

-

జగన్ సినిమాకెళ్లడంపై సోషల్ మీడియాలోనూ ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. ఓవైపు ఉత్తరాంధ్ర చిగురుటాకులా వణికిపోతుంటే.. ఈయనకు సినిమాలు కావల్సి వచ్చాయా? తన కార్యకర్తలకు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనమని చెప్పొచ్చుగా.. అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు ప‌చ్చ మీడియా కార్య‌క‌ర్త‌లు..

ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు రావడానికి ఇంకా 20 రోజుల సమయం ఉంది. అప్పటి వరకు పొలిటికల్ లీడర్లు కాస్త రిలాక్స్ అవుతున్నారు. ఇప్పటికే వైఎస్ జగన్ తన కుటుంబంతో సహా హాలీడే ట్రిప్‌కు వెళ్లి వచ్చారు. తాజాగా ఇవాళ అవేంజర్స్ ఎండ్ గేమ్ సినిమాను జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. మహేశ్ బాబు సినిమా హాల్ ఏఎంబీలో ఆయన సినిమా చూశారు.

jagan watches avengers end game in amb cinema hall

అయితే.. జగన్ సినిమా చూడటంపై చంద్రబాబు స్పందించారు. ఉండవల్లిలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. సినిమాకు వెళ్తే వెళ్లనివ్వండి. ఇక్కడ ఉండి మాత్రం ఆయన చేసేదేముంది. ప్రభుత్వం అన్ని పనులు చేసుకుంటుంది కదా. ఆయన చేసేది లేదు.. చేసేది లేదు.. ఆయన ఐదేళ్ల నుంచి అక్కడే ఉన్నారు. ఆయన హైదరాబాద్‌లో ఉండి ఎంజాయ్ చేస్తున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. కేసీఆర్ ప్రభుత్వం.. మంచి ప్రొటెక్షన్.. కానీ.. ఈ గేమ్ ఎండ్ కాదు కదా.. అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.

అయితే.. జగన్ సినిమాకెళ్లడంపై సోషల్ మీడియాలోనూ ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. ఓవైపు ఉత్తరాంధ్ర చిగురుటాకులా వణికిపోతుంటే.. ఈయనకు సినిమాలు కావల్సి వచ్చాయా? తన కార్యకర్తలకు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనమని చెప్పొచ్చుగా.. అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news