డిసెంబర్‌ 05 శనివారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

కార్తీకమాసం- శనివారం- డిసెంబర్‌-5

మేషరాశి: ఈరోజు పనిలో నూతన మార్పులు !

ఈరోజు ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేసే పనిలోనూ నూతన మార్పులు ఉంటాయి. ఆఫీస్‌లో అనుకూలంగా ఉంటుంది. మీ పని మహిళా స్నేహితురాలి సహాయంతో పూర్తవుతుంది. శుభకార్యక్రమం గురించి కుటుంబంలో చర్చించవచ్చు. జీవిత భాగస్వామితో తగిన సమయాన్ని గడుపుతారు.

పరిహారాలుః ‘ఓం నమో భగవతే వాసుదేవాయనమః’’ అనే నామాన్ని 108 సార్లు పారాయణం చేయండి.

todays horoscope

వృషభరాశి: ఈరోజు చిన్న సమస్యలు వస్తాయి !

ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఆఫీస్‌లో ఈ రోజు మీకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కాని మధ్యాహ్నం తర్వాత పై అధికారుల సహాయంతో ఇబ్బందులు అధిగమిస్తారు. ప్రణాళికతో పనులు చేస్తే విజయం సాధిస్తారు. పెద్దల సహాయంతో ఈరోజు వ్యాపార సమస్యలను అధిగమిస్తారు. సాయంత్రం నుంచి ఆర్థిక ప్రయోజనాలు ప్రారంభమవుతుంది. వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః ఓం శ్రీ అక్షరాయనమః అనే మంత్రాన్ని పారాయనం చేయండి దీనివల్ల అనుకూల ఫలితాలు వస్తాయి.

మిథునరాశి: ఈరోజు వృత్తికి సంబంధించి శుభవార్తలు !

ఈరాశి వారు అనుకూల ఫలితాలను పొందుతారు. చాలా కాలం తర్వాత వ్యక్తిగత జీవితం గురించి ఆలోచిస్తారు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. దీనివల్ల ప్రయోజనాలు పొందుతారు. వృత్తికి సంబంధించి శుభవార్తలు వినే అవకాశం ఉంది. తల్లిదండ్రులకు సేవ చేయడానికి మీకు అవకాశం లభిస్తుంది. వైవాహిక జీవితంలో సంతోషం, ఆనందం ఉంటాయి.

పరిహారాలుః శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన మీకు మంచి చేస్తుంది.

కర్కాటకరాశి: ఈరోజు ఆనందంగా ఉంటారు !

ఈరోజు గ్రహచలనాల రీత్యా అనుకూలంగా ఉంటుంది. చేసే పనులు, కార్యక్రమాలు కలిసి వస్తాయి. రాజకీయ నాయకులకు అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు శ్రమిస్తే మంచి ఫలితాలు వస్తాయి. వాహన సౌఖ్యం లభిస్తుంది. కుటుంబంలో గుర్తింపు ఉంటుంది.. వ్యాపారంలో ఒత్తిడి ఉంటుంది. వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః ఏదైనా దేవాలయంలో ప్రదక్షణలు, దానధర్మాలు మంచి ఫలితాలను మరింత పెంచుతాయి.


సింహరాశి: ఈరోజు అదృష్టం వరిస్తుంది !

అనుకూలమైన ఫలితాలు వస్తాయి. చదువుకునే విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం, పోటీపరీక్షల్లో విజయానికి అవకాశం ఉంది. అదృష్టం ఈరోజు మిముల్ని వరిస్తుంది. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. జీవిత భాగస్వామి భావాలను గౌరవించండి. సంసార జీవితం సాఫీగా సాగుతుంది.

పరిహారాలుః శ్రీలక్ష్మీదేవిని ఆరాధించండి. మంచి జరుగుతుంది.

 

కన్యరాశి: ఈరోజు మీకు అధికారుల మద్దతు లభిస్తుంది !

ఈరోజు అనుకూల ఫలితాలు వస్తాయి. సృజనాత్మక పని చేయడానికి అవకాశ. పెద్దల ఆశీర్వాదం లభిస్తాయి. రాజకీయ నాయకులకు మంచి వాతావరణం ఉంటుంది. మీరు ఎంచుకున్న రంగంలో మీ పై అధికారులు మద్దతు ఇస్తారు. విద్యార్థులు లక్ష్యాలను పూర్తి చేస్తారు. కుటుంబ జీవితంలో సంతోషం మరింత పెరుగుతుంది.

పరిహారాలుః శ్రీవేంకటేశ్వర వజ్రకవచ పారాయణం మంచి ఫలితం వస్తుంది.


తులరాశి: ఈరోజు ఆరోగ్యం జాగ్రత్త !

ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఆరోగ్యానికి సంబంధించి ఈ రోజు కొన్ని సమస్యలు రావచ్చు జాగ్రత్త. ఈరోజు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయవచ్చు. విద్యార్థులు విజయం సాధిస్తారు. భార్య తరుపు వారి నుంచి ప్రయోజనం పొందుతారు. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది.

పరిహారాలుః శ్రీకార్తీకదామోదర ఆరాధన మంచి ఫలితం ఇస్తుంది.

 

వృశ్చికరాశి: ఈరోజు మిశ్రమంగా ఉంటుంది !

ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. ఈరోజు అనుకోని సమస్యలు రావచ్చు కానీ వాటిని ధైర్యంతో అధిగమిస్తారు. వ్యాపారంలో ఇబ్బందులు ఉంటాయి. తెలియని శత్రువుల నుంచి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా శ్రమిస్తేనే మంచి ఫలితం వస్తుంది. వైవాహిక జీవితం బాగుంటుంది.

పరిహారాలుః శ్రీరామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

ధనస్సురాశి: ఈరోజు కష్టపడి పనిచేయాల్సిన పరిస్థితి !

ఈరోజు మిశ్రమ ఫలితాలు. ఈరోజు పురోగతి కోసం కష్టపడాలి. వారసత్వ ఆస్తికి సంబంధించిన వివాదాలు ముగుస్తాయి. కుటుంబ సంపద పెరుగుతుంది. విద్యార్థులు బాగా శ్రమించాల్సిన సమయం ఇది. కుటుంబంలో సామరస్య ఫలితం వస్తుంది.

పరిహారాలుః శివుడిని మారేడుదళాలతో ఆరాధిస్తే మంచి ఫలితం వస్తుంది.


మకరరాశి: ఈరోజు బహుమతులు అందుకునే అవకాశం !

ఈరోజు సానుకూల ఫలితాలు. ఈరోజు ఇష్టమైన వ్యక్తి నుంచి బహుమతి పొందే అవకాశం. ఈ రోజు కుటుంబ విషయాలపై దృష్టి పెట్టండి. ఆఫీస్‌లో అనుకూలంగా వాతావరణం.  కుటుంబంలో  పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతారు. వైవాహిక జీవితం సామరస్యంగా, సాఫీగా సాగుతుంది.

పరిహారాలుః శ్రీశివాభిషేకంతోపాటు దామోదరాష్టకం చదవండి.


కుంభరాశి: ఈరోజు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి శుభవార్త !

ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి. అనవసర విషయాలలో జోక్యం చేసుకోకండి.  రియల్‌ ఎస్టేట్‌లో  పెట్టుబడి పెట్టవచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్త అందే అవకాశం. వ్యాపారంలో ఉన్నవారికి లాభాలు రావచ్చు. సమస్యల నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.

పరిహారాలుః శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.


మీనరాశి: ఈరోజు కీర్తిప్రతిష్ఠలు సంపాదిస్తారు !

అనుకూల ఫలితాలు వస్తాయి. ఈరోజు మీరు బంధువులను కలుస్తారు. మీరు ఎంచుకున్న రంగంలో కీర్తి, ప్రతిష్టలను సంపాదిస్తారు. ఆఫీస్‌లో పై అధికారుల నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. పాతబాకీలు తీరుస్తారు. ఆర్థిక వృద్ధికి మార్గం సుగమం చేస్తుంది. వ్యాపార అభివృద్ధి చెందుతుతారు. విద్యార్థులు చిన్నచిన్న విజయాలను సాధిస్తారు. వైవాహిక జీవితంలో మంచి ఆహారం, మంచి వార్తలు ఉంటాయి.

పరిహారాలుః పేదలకు, అవసరమున్నవారికి ఆర్థిక సహాయం చేయండి.

-శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news