తెలుగు టెలివిజన్ చరిత్రలో అత్యంత ప్రజాదరణ తెచ్చుకున్న బిగ్ బాస్ రియాలిటీ షో నాలుగవ సీజన్ చివరి దశకి వచ్చేసింది. మొదటి నుండి ఈ నాలుగవ సీజన్ పై ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపించలేదనే చెప్పాలి. పెద్దగా తెలియని మొహాలు హౌస్ లోకి రావడం ఒక కారణమైతే, షో స్క్రిప్టు ప్రకారం జరుగుతుందన్న అనుమానాలు, దానికి తగినట్టుగా స్ట్రాంగ్ కంటెస్టెంట్లని హౌస్ బయటకి పంపించేయడం మొదలగు వాటి కారణాల వల్ల షో అంత ఆసక్తిగా నడవడం లేదన్నది చాలామంది వాదన.
ఈ రోజు జరిగిన ఎపిసోడ్ లో ఫినాలే టికెట్ ని అఖిల్ గెలుచుకున్నాడు. దాని తర్వాత మిగతావారికి వారు ఏ ఏ స్థానాల్లో ఉండాలనుకుంటున్నారో తేల్చుకొమ్మని బిగ్ బాస్ తెలిపాడు. సాధారణంగా ఇలాంటి టాస్కులు ఇచ్చినపుడు నువ్వంటే నువ్వని పెద్ద చర్చ జరుగుతుంది. కానీ ఇక్కడ అలాంటి చర్చలేం జరగలేదు. ఎవరికి వారు ఏ స్థానం కావాలనుకున్నారో అక్కడే నిలబడ్డారు. అదీగాక ఇప్పుడు స్థానం కోసం చర్చలు జరిపేంత ఓపిక లేదని తేల్చేసారు.
దాదాపు 90రోజుల పాటు ఒకే ఇంట్లో కంటెస్టెంట్లు అలసిపోయినట్లుగా అనిపిస్తుంది. ఆ కారణంగానే బిగ్ బాస్ షో ఆసక్తికరంగా సాగట్లేదని తెలుస్తుంది. తమకే స్థానం కావాలో డిసైడ్ చేసుకోవడానికి అలసిపోయిన కంటెస్టెంట్లు గెలవడానికి ఆసక్తి కనబర్చడం లేదని అర్థం అవుతుంది. అందరూ ఆటలో ఉండడానికి ఇష్టపడుతున్నారు గానీ గెలవడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇలాగే కొనసాగితే బిగ్ బాస్ చివరి వరకు వ్యూయర్ షిప్ మరింత తగ్గే అవకాశం ఉంది. మరి దీన్ని అధిగమించడానికి బిగ్ బాస్ నిర్వాహకులు ఏం చేస్తారో చూడాలి.