ఫిబ్రవరి 12 శుక్రవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

Join Our Community
follow manalokam on social media

శ్రీరామ ఫిబ్రవరి – 12- శుక్రవారం. మాఘమాసం.

 

మేష రాశి:కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు !

ఈరోజు బాగుంటుంది. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత విద్యలకు అర్హత సాధిస్తారు. రావలసిన మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. ధన లాభం పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి ఉంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. ప్రయాణాలకు అనుకూలం. భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటారు. వ్యాపారాల్లో లాభాలు పొందుతారు.
పరిహారాలు: శ్రీలక్ష్మీ స్తోత్ర పారాయణం చేసుకోండి.

todays horoscope

వృషభ రాశి:ధన లాభం పొందుతారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి ఉంటారు. ధన లాభం పొందుతారు. ప్రయాణాలకు అనుకూలం. తీర్థయాత్రలు చేస్తారు. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. కొత్త వ్యాపారాలను ప్రారంభించడం వల్ల లాభాలు కలుగుతాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు చేసుకుంటారు. గృహంలో శుభకార్యాన్ని తలపెడతారు. వివాహాది నిశ్చయ తాంబూలాలు అనుకూలిస్తాయి.
పరిహారాలుః ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

మిధున రాశి:శుభవార్తలు వింటారు !

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని ఉత్తమ విద్యార్థిగా పేరు పొందుతారు. స్నేహితులతో కలిసిమెలిసి ఆనందంగా ఉంటారు. ప్రయాణాలు చేయడానికి అనుకూలం. తీర్థయాత్రలు చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. సంతాన విషయంలో శుభవార్తలు వింటారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. గతంలో పోగొట్టుకున్న డబ్బులను, వస్తువులను వస్తువులను తిరిగి పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. వ్యాపారాలను విస్తరించుకొని అధిక లాభాలు పొందుతారు. కార్యసిద్ధి అనుకూలిస్తుంది.

పరిహారాలుః ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

కర్కాటక రాశి:వాహనాలను కొనుగోలు చేస్తారు !

ఈరోజు ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ఈరోజు తక్కువ మాట్లాడడం మంచిది. వాక్చాతుర్యం వల్ల అందరినీ మీరు ఆకట్టుకుంటారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి అభివృద్ధి పొందుతారు. అనుకున్న పనులను సరైన సమయానికి పూర్తి  చేయడం వలన కార్యసిద్ధి పొందుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం వలన అనారోగ్యానికి దూరంగా ఉంటారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. గృహంలో శుభకార్యాన్ని జరిపే అవకాశం ఉంది. గృహ స్థలాన్ని కొనుగోలు చేస్తారు.

పరిహారాలుః ఈరోజు అష్టాదశపీఠ స్తోత్ర పారాయణం చేసుకోండి.

సింహరాశి:వివాదాలు ఏర్పడతాయి !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. తొందరపడి మాట్లాడటం వల్ల నష్టం జరుగుతుంది.  సోదర,సోదరీమణుల మధ్య వివాదాలు ఏర్పడతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. వాహన ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రయాణాలు వాయిదా వేసుకోండి. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించడం మంచిది.  ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోరు, అశ్రద్ధ చేస్తారు. దీనివల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి
పరిహారాలుః శ్రీలలితా సహస్రనామ పారాయణం చేసుకోండి అంతా శుభం కలుగుతుంది.

 

కన్యారాశి:పోటీపరీక్షల్లో విజయం పొందుతారు !

ఈ రోజు బాగుంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి ఉంటారు.  అందరితో ఆనందంగా గడుపుతారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. రుణ విమోచన కలుగుతుంది. విద్యార్థులు బాగా చదువుకొని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో లాభాలు కలుగుతాయి. ప్రయాణాలకు అనుకూలం. వివాహానికి సంబంధ విషయాలు అనుకూలిస్తాయి. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. సోదరులతో సఖ్యత గా ఉంటారు.
పరిహారాలుః ఈరోజు శ్రీశివ అష్టకం పారాయణం చేసుకోండి.

తులారాశి:ఈరోజు ఆనందంగా ఉంటారు !

ఈరోజు ఆనందంగా ఉంటారు. మీ సొంతంగా మీరే చేసిన తప్పులను సరిదిద్దు కుంటారు. విద్యార్థులు బాగా చదువుకొని పోటీ పరీక్షల్లో ఉన్నతశ్రేణి మార్కులు పొందుతారు. ఉన్నతశ్రేణి మార్కులు పొందుతారు. పెద్ద వారిని గౌరవిస్తారు. వారి మాటలను సూచనలను మాటలను గౌరవిస్తారు. వ్యాపారాల్లో సమయస్ఫూర్తిగా పెట్టుబడులు పెట్టడం వలన లాభాలు కలుగుతాయి. భార్యాభర్తలు సఖ్యతగా ఆనందంగా ఉంటారు. అనారోగ్యాలను తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ఉత్తమ ఉద్యోగులు పేరుప్రఖ్యాతులు పొందుతారు. విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు.

పరిహారాలుః ఈరోజు శ్రీలలితా చాలీసా పారాయణం చేసుకోండి.

వృశ్చిక రాశి:ధన యోగం కలుగుతుంది !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉంటారు. ధనయోగం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. దైవ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. విద్యార్థులు అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. కుటుంబంలతో ముఖ్యవిషయాలు చర్చిస్తారు.శుభకార్య ప్రయత్నం చేస్తారు.
పరిహారాలుః ఈరోజు శ్రీచక్ర ఆరాధన లేదా శ్రీసూక్తం పారాయణం చేయండి.

 

ధనస్సు రాశి:ప్రమోషన్లు పొందుతారు !

ఈ రోజు బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. ప్రయాణాలకు అనుకూలం. కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి సఖ్యతగా ఉంటారు. గొప్ప వ్యక్తుల పరిచయాలు లాభాలు కలిగిస్తాయి. వ్యాపారాల్లో అధిక లాభాలు కలుగుతాయి. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉంటారు. మొండి బకాయిలను వసూలు వేసుకోవడం వలన ధన వృద్ధి కలుగుతుంది. వేద పండితులు పేరు, ప్రఖ్యాతలు పొందుతారు.
పరిహారాలుః ఈ రోజు శ్రీదుర్గాదేవి దగ్గర దీపారాధన, అమ్మవారి పారాయణం చేసుకోండి.

మకర రాశి:అప్పుల బాధలు తీరుతాయి !

ఈరోజు అంతా ఆనందంగా ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీ పరీక్షల్లో ఉన్నతశ్రేణి మార్కులు పొందుతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. నూతన గృహాలను కొనుగోలు చేస్తారు. గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. అప్పుల బాధలు తీరుతాయి.  ఈరోజు మీకు ధనవృద్ధి. విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పదోన్నతులు కలుగుతాయి.
పరిహారాలుః ఈరోజు శ్రీకామాక్షి అమ్మవారిని ఆరాధించండి.

కుంభరాశి:బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు !

ఈ రోజు బాగుంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా, ఆనందంగా ఉంటారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు లేదా ప్రయత్నాలు ప్రారంభిస్తారు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గృహంలో ఒక వేడుక జరుపుతారు. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. విద్యార్థులు కష్టపడి చదువు కొన్ని పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. సంపూర్ణ ఆరోగ్యం పొందుతారు. ఉద్యోగ స్థలం లేదా కార్యాలయాల్లో పదోన్నతులు పొందుతారు.
పరిహారాలుః ఈరోజు శ్రీరామరక్షా స్తోత్ర పారాయణం చేసుకుంటే అన్ని శుభాలే.

మీనరాశి:ధన లాభం కలుగుతుంది !

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. రావాల్సిన డబ్బులు సమయానికి చేతికి అందుతాయి. ధన లాభం కలుగుతుంది. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఆనందంగా ఉంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. కొత్త వ్యాపారాలను ప్రారంభించడం వలన అధిక లాభాలు కలుగుతాయి. అనారోగ్యాలను తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు కలసివస్తాయి.
పరిహారాలుః ఈరోజు శ్రీకనకధారా స్తోత్ర పారాయణం చేయండి మంచి జరుగుతుంది.

 

TOP STORIES

ఎంఆధార్‌ యాప్‌ తో 35 రకాల ఆధార్ సేవలు… వివరాలు ఇవే..!

మీ ఫోన్ లో ఎంఆధార్‌ యాప్ వుందా...? అయితే మంచిగా 35 రకాల ఆధార్ సేవలు వున్నాయి. సులువుగా ఉపయోగించుకోండి. దీని వలన మీకు సూపర్...