ఫిబ్రవరి 21 ఆదివారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

Join Our Community
follow manalokam on social media

శ్రీరామ మాఘమాసం – ఫిబ్రవరి – 21- ఆదివారం.

 

మేష రాశి:ప్రయాణాలు అనుకూలిస్తాయి !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. చేపట్టిన పనులు అనుకూలిస్తాయి. కార్యసాధన కలుగుతుంది. నూతన వ్యాపారాలో అధిక లాభాలు పొందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వివాహ నిశ్చయ తాంబూలాలు అనుకూలిస్తాయి. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు.

పరిహారాలు: రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధించండి.

 

todays horoscope

వృషభ రాశి:ఈరోజు ఆనందంగా ఉంటారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ మాట తీరు వల్ల అందరూ మిమ్మల్ని ఆదరిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఆనందంగా ఉంటారు. రాబోయే రోజుల గురించి ప్రణాళిక వేసుకుంటారు. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. గతంలో పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుతారు. పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందుతారు. ధనయోగం కలుగుతుంది. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. సోదరులతో కలసి మెలసి ఉంటారు.

పరిహారాలు: ఈరోజు ద్వాదశ జ్యోతిర్లింగ పారాయణం చేసుకోండి.

 

మిధున రాశి:పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుతారు !

ఈరోజు బాగుంటుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో అధికారులు మన్ననలు పొందుతారు. దేవాలయ దర్శనం చేసుకుంటారు. అయినా వారి ఆదరణ పొందుతారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. గతంలో పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుతారు.  ఇంతకుముందు ఉన్న అనారోగ్యాలను తగ్గించుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. అన్నదమ్ములతో సఖ్యతగా ఉంటారు. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు.

పరిహారాలు: ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

కర్కాటక రాశి:పరిచయాలు పెంచుకుంటారు !

ఈరోజు ఆనందంగా ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని ఉన్నత చదువులకు అర్హులవుతారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబంలో శుభకార్యాన్ని తలపెడతారు. ఉన్నత వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు కలుగుతాయి. సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. ధన లాభం కలుగుతుంది.

పరిహారాలు: శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించండి.

 

సింహరాశి:వ్యాపార భాగస్వాముల వల్ల లాభాలు !

ఈరోజు బాగుంటుంది. రుణబాధలు  తేలిపోతాయి. అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి. ధన లాభం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఆనందంగా ఉంటారు. వ్యాపార భాగస్వాముల వల్ల లాభాలు కలుగుతాయి. గతంలో పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుతారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పని భారం తగ్గుతుంది. అనారోగ్య సమస్యలను తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అనుకున్న స్థానాలకు బదిలీ అవుతారు.

పరిహారాలు: గణపతిని ఆరాధించండి.

 

కన్యారాశి:అందరినీ ఆకట్టుకుంటారు !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విహార యాత్రలు చేస్తారు. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. చేపట్టిన ప్రతి పనిని అనుకున్న సమయానికి పూర్తి చేసి ఆదరణ పొందుతారు. మీ మాట తీరు వల్ల అందరినీ ఆకట్టుకుంటారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో అనుకూలతలు పొందుతారు.

పరిహారాలు: ఈరోజు శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోండి.

 

 తులారాశి:పోగొట్టుకున్న డబ్బును పొందుతారు !

ఈరోజే అనుకూలంగా ఉంటుంది. దంపతులిద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అన్యోన్యంగా ఉంటారు. అనుకున్న పనులను సరైన సమయానికి పూర్తిచేస్తారు. కార్యసిద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని ఉత్తమ విద్యార్థులుగా పేరు పొందారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా, ఆనందంగా ఉంటారు. పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందుతారు. ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు.

పరిహారాలు: మీనాక్షి అమ్మవారిని ఆరాధించండి.

 

వృశ్చిక రాశి:పెట్టుబడులు అనుకూలిస్తాయి !

ఈరోజు బాగుంటుంది. ఎదుటివారికి సహాయం చేస్తారు. పేరు ప్రఖ్యాతులు పొందుతారు. మీ మాట తీరు వల్ల అందరినీ ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ప్రమోషన్లు కలుగుతాయి. నూతన వస్తు, వాహనాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో కొత్త పెట్టుబడులు అనుకూలిస్తాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు.

పరిహారాలు: లింగాష్టకం పారాయణం చేసుకోండి.

 

ధనస్సు రాశి:నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మొండి బాకీలు వసూలు చేసుకుంటారు. ధన యోగం కలుగుతుంది. అనారోగ్యాలను పోగొట్టుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. వివాహాది సంబంధ విషయాలు అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో అధిక లాభాలు కలుగుతాయి. దైవ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. స్థిరాస్తులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ఉత్తమ ఉద్యోగులుగా పేరు పొందుతారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.

పరిహారాలు: లక్ష్మీ అమ్మవారిని ఆరాధించండి.

 

మకర రాశి:సోదరులతో సఖ్యతగా ఉంటారు !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరులకు సహాయం చేయడానికి ప్రాధాన్యతనిస్తారు. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు. సోదరులతో సఖ్యతగా ఉంటారు. స్నేహితుల సహకారంతో వ్యాపార పెట్టుబడులు అనుకూలిస్తాయి, లాభాలు కలుగుతాయి. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ప్రమోషన్లు కలుగుతాయి. పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుతారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని పోటీ పరీక్షలో ఉన్నత శ్రేణి మార్కులు పొందుతారు.

పరిహారాలు: ఈరోజు దక్షిణామూర్తిని ఆరాధించండి.

 

 కుంభరాశి:రుణబాధలు తీరుతాయి !

ఈరోజు ఆనందకరంగా ఉంటుంది. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. గతంలో పోగొట్టుకున్న డబ్బులను, వస్తువులను తిరిగి పొందుతారు. విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులను సరైన సమయానికి పూర్తిచేస్తారు. కార్యసిద్ధి కలుగుతుంది. సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. రుణబాధలు తీరుతాయి. ధన యోగం కలుగుతుంది. వ్యాపారాలను విస్తరించు కుంటారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు.

పరిహారాలు: లలిత అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

మీన రాశి:దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మొండి బాకీలు వసూలు చేసుకుంటారు. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉంటారు. ధనప్రాప్తి కలుగుతుంది. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. అధిక లాభాలు కలుగుతాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉత్తమ కళాశాలల్లో సీట్లు ఏర్పరచుకుంటారు. ఉత్తమ వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు.

పరిహారాలు: దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి.

 

TOP STORIES

శనిత్రయోదశి రోజు ఏం చేయాలి?

శనిదేవుడు అంటేనే మనకు భయం. ఎందుకంటే శనిదేవుడు మన జన్మరాశిలోకి ప్రవేశిస్తే ఏడు ఏళ్లు మనకు కష్టాలు కలుగుతాయనే నమ్మకం. నిజానికి శనిదేవుడు మంచివాడు. శని...