ఫిబ్రవరి 25 గురువారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

శ్రీరామ ఫిబ్రవరి – 25 – మాఘమాసం – గురువారం.

 

మేష రాశి:కార్యాలయాల్లో ఇబ్బందులు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. అవసరానికి డబ్బులు అందక ఇబ్బందులు ఏర్పడతాయి. రుణ బాధలు పెరుగుతాయి. ధన నష్టం జరుగుతుంది. అనుకున్న పనులు సమయానికి పూర్తి కాక వాయిదా పడతాయి. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ వహించడం మంచిది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రయాణాలు అనుకూలం. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఏర్పడతాయి.

పరిహారాలుః విశ్వనాధాష్టకం పారాయణం చేసుకోండి.

 

todays horoscope

వృషభ రాశి:అనారోగ్యాన్ని తగ్గించుకుంటారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. బకాయిలను వసూలు చేసుకుంటారు. ధన లాభం కలుగుతుంది. విద్యార్థులు బాగా చదువుకుంటారు, పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొని అనారోగ్యాన్ని తగ్గించుకుంటారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు కలసి వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అనుకున్న స్థానాలకు బదిలీ అవుతారు.

పరిహారాలుః రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధించండి.

 

మిధున రాశి:అందరూ మిమ్మల్ని ఆకర్షిస్తారు !

ఈరోజు బాగుంటుంది. మీ మాట తీరు వల్ల అందరూ మిమ్మల్ని ఆకర్షిస్తారు. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. ధన యోగం కలుగుతుంది. ముఖ్యమైన విషయాల్లో స్నేహితుల సహకారం తీసుకుంటారు. మిత్ర లాభం కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం. కాంట్రాక్టు ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది. వివాహాది  నిశ్చయ తాంబూలాలు అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో లాభాలు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. కార్యసిద్ధి కలుగుతుంది.

పరిహారాలుః కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

కర్కాటక రాశి:పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుతారు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. ఎంత కష్టమైన పనినైనా ఆత్మస్థైర్యంతో ఎదుర్కొంటారు. వ్యాపారాలను విస్తరించుకుంటారు. గతంలో పోగొట్టుకున్న ఉద్యోగాలను, వస్తువులను తిరిగి పొందుతారు. గృహంలో శుభకార్యాన్ని తలపెడతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు.

పరిహారాలుః ఈరోజు జ్ఞానప్రసూనాంబ అమ్మవారినీ ఆరాధించండి.

 

సింహరాశి:అప్పుల బాధలు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. మీలో ఉన్న కోపం వల్ల సహాయం చేసేవారు దూరమవుతారు. మీ మాట తీరు బాగా లేకపోవడం వల్ల అందరూ మీకు దూరం అవుతారు. తక్కువ మాట్లాడడం మంచిది. విలువైన పత్రాల మీద సంతకాలు చేయడం వల్ల నష్టాలు. అనవసరపు ఖర్చులు చేయడం వల్ల నష్టం కలుగుతుంది. అప్పుల బాధలు పెరుగుతాయి. ధననష్టం కలుగుతుంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. విద్యార్థులు అనవసర విషయాలను పట్టించుకోని చదువును నిర్లక్ష్యం చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.

పరిహారాలుః నవగ్రహారాధన చేసుకోండి, దగ్గర్లో ఉన్న ఆలయానికి వెళ్లి నవగ్రహాలకు 11 ప్రదక్షిణలు చేయండి.

 

కన్యారాశి:పోటీ పరీక్షలో విజయం !

ఈరోజు ఆనందకరంగా ఉంటుంది. మొండి బాకీలు వసూలు చేసుకుంటారు. ధన యోగం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీ పరీక్షలో విజయం పొందుతారు, ఉన్నత చదువులకు అర్హులవుతారు. వ్యాపార భాగస్వాముల వల్ల లాభాలు. ఇంట్లో వేడుక జరుపుతారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు పొందుతారు. ఉద్యోగస్తుల కార్యాలయాల్లో గొప్ప అవకాశాలను పొందుతారు. గతంలో పోగొట్టుకున్న ఉద్యోగాలను తిరిగి పొందుతారు. సాంప్రదాయక ఆహారానికి ప్రాధాన్యత ఇస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు.

పరిహారాలుః సుందరాకాండ పారాయణం చేసుకోండి.

 

 తులారాశి:పెట్టుబడులు అనుకూలించవు !

ఈరోజు అనుకూలంగా లేదు. మీకు సహాయం చేసేవారు దూరమవుతారు. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ వహించడం మంచిది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పై అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలించవు, స్వల్ప నష్టాలు ఏర్పడతాయి. విలువైన పత్రాల మీద సంతకాలు చేయడం వల్ల సమస్యలు ఎదురవుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. అనవసరపు విషయాలు చర్చించడం వల్ల విభేదాలు.

పరిహారాలుః హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి:విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు !

ఈరోజు బాగుంటుంది. స్నేహితులతో, సోదరులతో సఖ్యతగా, ఆనందంగా ఉంటారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. గతంలో పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. దంపతులు అన్యోన్యంగా ఉంటారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి .విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు.

పరిహారాలుః అన్నపూర్ణా దేవిని ఆరాధించండి.

 

ధనస్సు రాశి:తోటి ఉద్యోగుల వల్ల ఒత్తిడి !

ఈరోజు ప్రయోజకరంగా లేదు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో తోటి ఉద్యోగుల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ప్రయాణాలు కలిసి రావు. వ్యసనాలకు దూరంగా ఉండండి. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఏర్పడతాయి. ఇతరుల మీద ఆధారపడటం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి.

పరిహారాలుః శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించండి.

 

మకర రాశి:తీర్థయాత్రలు చేస్తారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. అనుకున్న పనులు సరైన సమయానికి పూర్తిచేస్తారు. కార్యసిద్ధి కలుగుతుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉత్తమ విద్యార్థిగా పేరు పొందుతారు. తీర్థయాత్రలు చేస్తారు. ఇంతకుముందు అనారోగ్యాన్ని తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. ధన లాభం కలుగుతుంది.

పరిహారాలుః శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

 

కుంభరాశి:నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఇంతకుముందు పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం. ఉద్యోగస్తుల కార్యాలయాల్లో గొప్ప హోదాలను పొందుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ వహిస్తారు. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.

పరిహారాలుః లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

 

మీన రాశి:వ్యాపార భాగస్వాముల వల్ల లాభాలు !

ఈరోజు బాగుంటుంది. మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. విద్యార్థులు తోటి విద్యార్థులతో పోటీపడి కష్టపడి చదువుకుంటారు. వ్యాపార భాగస్వాముల వల్ల లాభాలు. అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉంటారు. ధన యోగం కలుగుతుంది. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉంటారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ప్రమోషన్లు.

పరిహారాలుః మీనాక్షి అమ్మవారిని ఆరాధించండి.

 

Read more RELATED
Recommended to you

Latest news