ఫిబ్రవరి 26 శుక్రవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

ఫిబ్రవరి – 26 – మాఘ మాసం – శుక్రవారం.

 

మేష రాశి:బకాయిలను వసూలు చేసుకుంటారు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు, పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు. అనుకున్న పనులను సరైన సమయానికి పూర్తిచేస్తారు. కార్యసిద్ధి కలుగుతుంది. తల్లిదండ్రుల మాటలను, సూచనలను పాటిస్తారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. సోదరులతో సఖ్యత గా, సంతోషంగా ఉంటారు. ఖర్చులకు దూరంగా ఉంటారు. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. ధన లాభం కలుగుతుంది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు.

పరిహారాలుః రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధించండి.

 

todays horoscope

వృషభ రాశి:ప్రయాణాలు అనుకూలిస్తాయి !

ఈరోజు బాగుంటుంది. దంపతులిద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అన్యోన్యంగా ఉంటారు. గతంలో పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుతారు. రుణ బాధలు తీరిపోతాయి. అవసరానికి డబ్బులు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. నూతన గృహాలను కొనుగోలు చేస్తారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత విద్యలకు అర్హులవుతారు. ఇంట్లో వేడుకను జరుపుతారు.

పరిహారాలుః లలితా అష్టోత్తర శత నామ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

మిధున రాశి:స్థిరాస్తులు అనుకూలిస్తాయి !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. సోదర సోదరీమణులతో ఆనందంగా ఉంటారు. వ్యాపారాల్లో లాభాలు. స్థిరాస్తులు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా, సఖ్యతగా ఉంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.

పరిహారాలుః శ్రీ వెంకటేశ్వర గోవింద నామ పారాయణం చేసుకోండి.

 

కర్కాటక రాశి:కార్యాలయాల్లో పదోన్నతులు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పదోన్నతులు పొందుతారు. పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుతారు. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెడతారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉంటారు.

పరిహారాలుః మణిద్వీప వర్ణన పారాయణం చేసుకోండి.

 

సింహరాశి:విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. స్నేహితులతో ఆనందంగా, సఖ్యతగా ఉంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. వాహనాలను కొనుగోలు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తారు. వ్యాపార భాగస్వాముల వల్ల లాభాలు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు.

పరిహారాలుః శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి:ఈరోజు సంతోషంగా ఉంటారు !

ఈరోజు బాగుంటుంది. బంధువులతో సంతోషంగా ఉంటారు. గృహంలో శుభకార్యాన్ని తలపెడతారు. వివాహ నిశ్చయ తాంబూలాలు అనుకూలిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు. ఉద్యోగ స్థలం పై అధికారులచే కీర్తింపబడ తారు.

పరిహారాలుః ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

తులారాశి:పోటీ పరీక్షల్లో విజయం !

ఈరోజు బాగుంటుంది. విద్యార్థులు తోటి విద్యార్థులతో పోటీపడి చదువుకొని పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు. ఇంతకు ముందున్న అనారోగ్యాలను పోగొట్టే కొని ఆరోగ్యంగా ఉంటారు. మిత్రుల సహకారం తీసుకొని మిత్ర లాభం పొందుతారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం పొందుతారు. కాంట్రాక్టు ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది. వివాహాది సంబంధ ప్రయత్నాలు ఫలిస్తాయి. రుణ బాధలు తీరిపోతాయి. ఆర్థిక లాభం కలుగుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి.

పరిహారాలుః ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి:స్థిరాస్తులు అనుకూలిస్తాయి !

ఈరోజు ఆనందకరంగా ఉంటుంది. ఎంత కష్టమైన పనినైనా ఆత్మస్థైర్యంతో ధైర్యంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు, ఉత్తమ విద్యార్థిగా పేరు పొందుతారు. ఎదుటివారికి సహాయం చేస్తారు. సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారు. వ్యాపారాల్లో ధనలాభం కలుగుతుంది. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. ధనప్రాప్తి కలుగుతుంది. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. స్థిరాస్తులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీ మాట తీరు వల్ల అందరినీ ఆకట్టుకుంటారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పొందుతారు. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు. గతంలో పోగొట్టుకున్న ఉద్యోగాన్ని, వస్తువులను తిరిగి పొందుతారు.

పరిహారాలుః శివపంచాక్షరీ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

 ధనస్సు రాశి:అనారోగ్య సమస్యలు !

ఈరోజు అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పని ఒత్తిడి. ప్రశాంతత కోల్పోతారు. తల్లిదండ్రుల మాటలను పటించకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యార్థులు చదువు మీద అశ్రద్ధ చూపుతారు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి. విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోకపోతే ఎక్కడైనా పడిపోయే అవకాశం ఉంది. విలువైన సంతకాలు చేయడం వల్ల సమస్యలు ఎదురవుతాయి.

పరిహారాలుః శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి.

 

మకర రాశి:నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు !

ఈ రోజు బాగుంటుంది. ఎంత కష్టమైన పనినైనా పట్టుదలతో అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కార్యసాధన కలుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు. స్థిరాస్తులు అనుకూలిస్తాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పదోన్నతులు అందుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్య దాంపత్య జీవనం ఏర్పడుతుంది. వాహనాలను కొనుగోలు చేస్తారు. విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు.

పరిహారాలుః నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

కుంభరాశి:ఆభరణాలను కొనుగోలు చేస్తారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీ పరీక్షల్లో ఉన్నతశ్రేణి మార్పులు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు. విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. మిత్ర లాభం కలుగుతుంది.

పరిహారాలుః లలిత అష్టోత్తర నామ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

మీన రాశి:వ్యాపారాలు అనుకూలిస్తాయి !

ఈరోజు ఆనందకరంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన విషయాల్లో స్నేహితుల సహకారం పొందుతారు. స్నేహితులతో సఖ్యతగా ఉంటారు. ఇంటిని కొనుగోలు చేస్తారు. ప్రయాణ లాభం కలుగుతుంది. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని ఉన్నత విద్యలకు అర్హులవుతారు.

పరిహారాలుః ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version