జనవరి 16 శనివారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

​ జనవరి –  16 – పుష్యమాసం  – శనివారం.

 

మేష రాశి:ధన ప్రాప్తి పొందుతారు !

ఈరోజంతా బాగుంటుంది. ఈరోజు అనవసర ఖర్చులకు దూరంగా ఉండి ధన ప్రాప్తి పొందుతారు. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. గృహ స్థలాలు కొనుగోలు చేస్తారు. అయిన వారితో, బంధువులతో సంతోషంగా ఉంటారు. మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి. వ్యాపార లాభాలు కలుగుతాయి. విద్యార్థులు బాగా చదువుకొని పోటీపరీక్షల్లో ఉత్తీర్ణత పొందుతారు. మీ భాగస్వామి ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తారు.

పరిహారాలుః ఈరోజు భ్రమరాంబిక అష్టకం పారాయణం చేసుకోండి.

 

todays horoscope

 వృషభ రాశి:ఈరోజు పై చదువులకు ఉత్తీర్ణులు అవుతారు !

ఈరోజు బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. విద్యార్థులు బాగా చదువుకొని పై చదువులకు ఉత్తీర్ణులు అవుతారు. ఉద్యోగంలో ప్రమోషన్లు పొందుతారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. ఈరోజు మీరు ఉత్సాహభరితంగా పనిచేసేతీరు మీ సహుద్యోగులను ఆకర్షిస్తుంది. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. విలువైన వస్తు వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

పరిహారాలుః ఈరోజు లక్ష్మీ అష్టోత్తరం పారాయణం చేసుకోండి.

 

 మిధున రాశి:ఈరోజు అన్నదమ్ములతో వివాదాలు !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. విలువైన పత్రాలను జాగ్రత్తగా చూసుకోవడం మంచిది, ఎక్కడైనా పడిపోయే అవకాశం ఉంటుంది. తక్కువగా మాట్లాడడం మంచిది. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. అన్నదమ్ములతో వివాదాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త, అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. వాహన ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త, చిన్న చిన్న ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అప్పులు ఇవ్వడం తీసుకోవడం చేయకుండా ఉండడం మంచిది. ధననష్టం జరిగే అవకాశం ఉంది. పెద్దవారిని గౌరవించడం మంచిది. ఉద్యోగస్తులకు పై అధికారుల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. పిల్లల విషయంలో జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. కొత్త వ్యాపార పెట్టుబడి పెట్టడం వల్ల నష్టం జరిగే అవకాశం ఉంటుంది.

పరిహారాలుః ఈరోజు దుర్గా దేవి అష్టోత్తర పారాయణం చేసుకోండి, ఎవరైనా బ్రాహ్మణుడికి బియ్యం దానం ఇవ్వండి శుభ ఫలితాలు కలుగుతాయి.

 

 కర్కాటక రాశి:ఈరోజు వ్యాపారంలో స్వల్ప నష్టాలు !

ఈరోజు అనుకూలమైన రోజు కాదు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. విద్యార్థులు అనవసరపు విషయాలకు దూరంగా ఉండి చదువుమీద శ్రద్ధ పెట్టడం మంచిది. వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. ఈరోజు వివాదాలకు దూరంగా ఉండండి. ఎవరితో అయినా సఖ్యతగా మాట్లాడడం వల్ల విభేదాలు రాకుండా ఉంటాయి. వ్యాపారం లో స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల సేవ చేసుకోవడం వల్ల బాగుంటుంది.

పరిహారాలుః ఈరోజు దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

సింహరాశి:స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు !

ఈరోజు బాగుంటుంది. అప్పుల బాధలు తీరిపోతాయి. మొండి బకాయిలు వసూలు చేసుకొని ధన లాభం పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. ఉద్యోగస్తులకు అనుకున్న స్థానాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. బంగారు ఆభరణాలను, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఉత్తమ వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. దేవాలయ దర్శనం చేస్తారు. ఆధ్యాత్మిక చింతన చేస్తారు. దంపతులు అన్యోన్యంగా ఉంటారు.

పరిహారాలుః ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి:సోదరుల నుంచి శుభవార్తలు !

ఈరోజంతా శుభయోగంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన చేస్తారు. సోదరుల నుంచి శుభవార్తలు వింటారు. అప్పుల బాధలు తీర్చుకుంటారు. అనవసర ఖర్చులు తగ్గించుకొని ధన ప్రాప్తి పొందుతారు. వ్యాపార లాభాలు కలుగుతాయి. ఏదో ఒక శుభకార్యాన్ని ఇంట్లో తలపడతారు.

పరిహారాలుః ఈరోజు గోవిందనామలు పారాయణం చేసుకోండి.

 

తులారాశి:ఈరోజు మనోవేదనకు గురవుతారు !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. తెలియని మనోవేదనకు గురవుతారు. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టి చదవడం మంచిది. తక్కువగా మాట్లాడటం మంచిది .ఈరోజు తొందరగా ఎవ్వరిని నమ్మకుండా ఉండటం మంచిది, మోసపోయే అవకాశం ఉంది. వ్యాపార నష్టం జరిగే అవకాశం ఉంది.

పరిహారాలుః ఈ రోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి:ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త !

ఈరోజు అనుకూలమైన రోజు కాదు. కోపానికి, చిరాకు దూరంగా ఉండటం మంచిది లేదంటే ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఎవరితో అయినా తక్కువగా మాట్లాడడం మంచిది. విద్యార్థులు పనికిరాని విషయాలను వదిలేసి చదువు మీద దృష్టి పెట్టడం మంచిది. ప్రయాణాలకు అనుకూలమైన రోజు కాదు. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త, ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎవరికి మాట ఇవ్వడం మంచిది కాదు.

పరిహారాలుః ఈరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

 ధనస్సు రాశి:ఈరోజు అప్పుల బాధలు తీర్చుకొంటారు !

ఈ రోజు బాగుంటుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు. ఈ రోజంతా ఆరోగ్యంగా ఉంటారు. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండి అప్పుల బాధలు తీర్చుకొంటారు. సరైన సమయంలో నిద్రాహారాలు తీసుకుంటారు. వ్యాపారంలో లాభాలు. విద్యార్థులు కష్టపడి బాగా చదువుకొని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. ఆర్థిక లాభం పొందుతారు.

పరిహారాలుః ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేసుకోండి.

 

మకర రాశి:ఈరోజు పనులు వాయిదా !

ఈరోజు ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ఎక్కువగా మాట్లాడటం మంచిది కాదు. ఈ రోజు ప్రయాణాలకు దూరంగా ఉండటం, వాయిదా వేసుకోవడం మంచిది. ఈరోజు విద్యార్థులు కష్టపడి చదువు మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు  జాగ్రత్త. వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం వల్ల  స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.  అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి కాక వాయిదా పడే అవకాశం ఉంది.

పరిహారాలుః శ్రీవేంకటేశ్వరస్వామి గద్యం లేదా సుప్రభాతం పారాయణం చేయండి.

 

కుంభరాశి:పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందుతారు !

ఈ రోజు బాగుంటుంది. ఈరోజు అనుకున్న పనులు కష్టపడి పూర్తిచేసి కార్యసాధన పొందుతారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం పొందుతారు. ఇంతకుముందు పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందుతారు. ఇంటి స్థలాలను కొనుగోలు చేస్తారు. కొత్త వ్యాపార పెట్టుబడులు పెట్టి విశేషమైన ధన లాభం పొందుతారు. ఈరోజు విద్యార్థులు బాగా చదువుకొని పోటీ పరీక్షల్లో ఉన్నతశ్రేణి మార్కులు పొందుతారు.

పరిహారాలుః గణేశ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

 మీన రాశి:ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. దేవాలయ దర్శనం చేసుకుంటారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ విద్యను పొందుతారు. పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందుతాను తిరిగి పొందుతారు. ఈరోజు వ్యాపార లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. ధన లాభం పొందుతారు.

పరిహారాలుః ఈరోజు లలిత అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

Read more RELATED
Recommended to you

Latest news