జనవరి 21 గురువారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

Join Our Community
follow manalokam on social media

జనవరి – 21 – పుష్యమాసం – గురువారం.

 

మేష రాశి:పెట్టుబడులు  వల్ల లాభాలు !

ఈరోజు బాగా ఉంటుంది. విద్యార్థులు బాగా చదువుకొని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. ఉన్నత పరిచయాలు పెంచుకోవడం వల్ల లాభాలు కలుగుతాయి. సోదరులతో సఖ్యతగా ఉంటారు. కొత వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. ఉద్యోగస్తులకు ఉన్నత స్థానాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు కలుగుతాయి. నూతన గృహాలను కొనుగోలు చేస్తారు. విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వాహనాలను కొనుగోలు చేస్తారు.

పరిహారాలుః ఈరోజు గణేష స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

todays horoscope

వృషభ రాశి:ఈరోజు ఉద్యోగంలో ఇబ్బంది !

ఈరోజు కొంచెం కష్టంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగంలో ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఎవరికీ అనవసరమైన సహాయాలు చేయకుండా ఉండటం మంచిది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవడం మంచిది, చిన్న చిన్న ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. విద్యార్థులు చదువు మీద ఏకాగ్రత చూపడం మంచిది. వ్యాపార పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రోజు కాదు లేదంటే స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆడపిల్లలు బయటకి రాకుండా ఉండటం మంచిది, ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. తీర్థయాత్రలు చేయకుండా ఉండటం మంచిది.

పరిహారాలుః ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేసుకోండి శుభ ఫలితాలు కలుగుతాయి.

 

 మిధున రాశి:ధన లాభం పొందుతారు !

ఈరోజు అదృష్టంగా ఉంటుంది. అప్పుల బాధలు తీరిపోయి ధన లాభం పొందుతారు. ఉన్న అనారోగ్యాలు తగ్గిపోయి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. వ్యాపారాలను విస్తరించి కొత్త పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు కలుగుతాయి. వాహనాలను కొనుగోలు చేస్తారు. బంగారు ఆభరణాల యోగం కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో ఉత్తమ విద్యార్థుల పేరు పొందుతారు.

పరిహారాలుః ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

కర్కాటక రాశి:ఈరోజు ఉద్యోగులకు పని ఒత్తిడి !

ఈరోజు సానుకూలంగా ఉంటుంది. ఎవరితో ఆయన మాట్లాడేటప్పుడు, ఏ పని చేసిన తెలివిగా చేయడం వల్ల బాగుంటుంది. తక్కువగా మాట్లాడడం మంచిది. కోపాలకు, వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో అప్పటికప్పుడు పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు కలిసొస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టకపోవటం మంచిది. విద్యార్థులు సమయాన్ని వృధా చేసుకోకుండా చదువు మీద దృష్టి పెట్టడం మంచిది.

పరిహారాలుః ఈరోజు శ్రీ లక్ష్మి నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేసుకోండి

 

సింహరాశి:వివాహ సంబంధ విషయాల్లో అనుకూలం !

ఈరోజంతా అదృష్ట యోగంగా ఉంటుంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉంది మొండి బకాయిలను వసూలు చేసుకొకుంటారు. ధన లాభం పొందుతారు. విద్యార్థులు కష్టపడి చదువుకొని పోటీపరీక్షల్లో ఉత్తమ విద్యార్థులుగా పేరు పొంది ఉద్యోగ అవకాశాలు అవకాశాలు పొందుతారు. వ్యాపారంలో అధిక లాభాలు కలిగే అవకాశం ఉంటుంది. అన్నదమ్ములతో కలిసి మెలిసి ఉంటారు. ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. వివాహ సంబంధ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది.

పరిహారాలుః లలిత అష్టోత్తర శతనామ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి:ఈరోజు కొంచెం కష్టంగా ఉంటుంది !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఏ పనిలో అయినా తొందర పడకుండా ఉండటం మంచిది, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది, అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. ప్రయాణాలకు అనుకూలమైన రోజు కాదు. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయడం మంచిది, చిన్న చిన్న ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అనవసర విషయాల చర్చలకు దూరంగా ఉండడం మంచిది. విలువైన పత్రాల మీద సంతకాలు చేయకుండా ఉండటం మంచిది. ఉద్యోగస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. చెప్పుడు మాటలకు దూరంగా ఉండటం మంచిది లేదంటే నష్టం కలిగే అవకాశం ఉంటుంది.

పరిహారాలుః ఈరోజు దుర్గా దేవి అష్టోత్తర పారాయణం చేసుకోండి, దగ్గర్లో ఉన్న అమ్మవారి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోండి శుభ ఫలితాలు కలుగుతాయి.

 

 తులారాశి:ఈరోజు కార్యసిద్ధి పొందుతారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులను సరైన సమయంలో పూర్తిచేసి కార్యసిద్ధి పొందుతారు. అందరితో బాగా మాట్లాడడం వల్ల అందరూ మిమ్మల్ని ఆకర్షిస్తారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. వ్యాపార పెట్టుబడులు పెట్టడం వలన ధన లాభం కలుగుతుంది. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. అన్నదమ్ములు సఖ్యతగా ఉంటారు ఉంటారు. దంపతులు అన్యోన్యంగా ఉంటారు.

పరిహారాలుః శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి:ప్రయాణాలకు అనుకూలమైన రోజు !

ఈరోజు అంతా లాభకరంగా ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి వ్యాపార విస్తరణ చేసి ధన లాభం పొందుతారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు అన్నదమ్ములతో కలిసి మెలిసి సఖ్యతగా ఉంటారు. ఎక్కడైతే అవమానం పొందుతారో అక్కడే గౌరవించబడ్డాతారు. ప్రయాణాలకు అనుకూలమైన రోజు.

పరిహారాలుః ఈరోజు శ్రీ రామరక్షా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

ధనస్సు రాశి:పోటీపరీక్షల్లో ఉన్నత శ్రేణి మార్కులు పొందుతారు !

ఈరోజు బాగుంటుంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉంటారు. అప్పుల బాధలు తీర్చుకొని ధన యోగం పొందుతారు. విద్యార్థులు బాగా చదువుకొని పోటీపరీక్షల్లో ఉన్నత శ్రేణి మార్కులు పొందుతారు. వ్యాపారంలో స్వల్ప లాభాలు కలుగుతాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి.

పరిహారాలుః విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోండి.

 

మకర రాశి:ఈరోజు స్వల్ప నష్టాలు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. ఏ పని చేసినా, ఏ విషయంలో అయినా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. దంపతుల సమస్యలు వారే పరిష్కరించుకోవడం మంచిది. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. వ్యాపారంలో పెట్టుబడి పెట్టకుండా ఉండడం మంచిది, స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది.

పరిహారాలుః బ్రాహ్మణుడికి దానం చేసుకోండి శుభ ఫలితాలు కలుగుతాయి.

 

 కుంభరాశి:ఈరోజు ఆభరణాలను కొనుగోలు చేస్తారు !

ఈరోజు అదృష్ట యోగంగా ఉంటుంది. దంపతులు అన్యోన్యంగా ఉంటారు. ఇంతకుముందు ఉన్న అనారోగ్యాలు తగ్గిపోయి ఆరోగ్యాన్ని పొందుతారు. గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. సంతాన విషయంలో శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టడం వల్ల ధన ప్రాప్తి పొందుతారు. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉత్తమ విద్యార్థిగా పేరు పొందుతారు.

పరిహారాలుః ఈరోజు శ్రీ రామ నామ పారాయణం చేసుకొండి.

 

మీన రాశి:మానసిక ప్రశాంతత కోల్పోతారు !

ఈరోజు సానుకూలంగా ఉంటుంది. అహంకారానికి, కోపానికి దూరంగా ఉండటం మంచిది. ఈరోజు ఎవరికీ మాట ఇవ్వకపోవడం మంచిది. కఠినంగా మాట్లాడటం వల్ల అయినవారు, స్నేహితులు మీకు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. అనవసరపు ఖర్చులుకు దూరంగా ఉండటం మంచిది, ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు ఆఫీసులో పని ఒత్తిడి పెరిగి మానసిక ప్రశాంతత కోల్పోతారు.

పరిహారాలుః లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

 

TOP STORIES

అందరి ముందు మాట్లాడాలంటే భయమా…? అయితే ఇది మీకోసం…!

చాలా మంది కింద చాలా బాగా మాట్లాడతారు. కానీ ఒక్కసారి అందరి ముందు నిలబడి మాట్లాడాలంటే చేతులు వణికి పోతాయి. అలానే పేనిక్ అయిపోతుంటారు. ఇది...