మార్చి 04 గురువారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

శ్రీరామ మార్చి-4 – మాఘమాసం – గురువారం.

మేష రాశి:ప్రయాణాలు అనుకూలిస్తాయి !

ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. కార్యసిద్ధి కలుగుతుంది. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. రుణ బాధలు తీరిపోతాయి. ధన యోగం కలుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. లాభాలు కలుగుతాయి. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ఉన్నత పదవులను అందుకుంటారు.
పరిహారాలుః ఈరోజు జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని ఆరాధించండి.

todays horoscope

వృషభ రాశి:వ్యాపారాలలో లాభాలు !

ఈ రోజు బాగుంటుంది. ప్రయాణాలు కలిసొస్తాయి. కుటుంబసభ్యులతో అందరితో సంతోషంగా సఖ్యతగా ఉంటారు. ఇంతకుముందు ఉన్న అనారోగ్యాన్ని పోగొట్టుకొని ఆరోగ్యంగా ఉంటారు. వ్యాపారాలలో లాభాలు కలుగుతాయి. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని ఉన్నత విద్యలకు అర్హులవుతారు. వివాహ సంబంధ విషయాలు అనుకూలిస్తాయి.
పరిహారాలుః ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధించండి.

మిధున రాశి:తొందరపాటు వల్ల సమస్యలు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. మీలో ఉన్న కోపము ఆవేశము తొందరపాటు తనం వల్ల సమస్యలు కలుగుతాయి. తెలియని వ్యక్తులతో పరిచయాలు వల్ల అనర్ధాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు కలుగుతాయి. విద్యార్థులు అనవసరపు విషయాలను పట్టించుకోవడం వల్ల విద్య మీద శ్రద్ధ కోల్పోతారు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి.
పరిహారాలుః ఈ రోజు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ఆరాధించండి.

కర్కాటక రాశి:పెట్టుబడులు అనుకూలించవు !

ఈరోజు ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. అనవసరపు విషయాలను చర్చించడం వల్ల సమస్యలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలించవు. స్వల్ప నష్టాలు కలుగుతాయి. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ వహించడం మంచిది. ఉద్యోగస్తులకు కార్యాలయాలపై అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. అప్పుల బాధలు పెరుగుతాయి. అనవసరపు ఖర్చులు అధికమవుతాయి. నష్టం కలుగుతుంది.
పరిహారాలుః ఈరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోండి దగ్గర్లో ఉన్న ఆలయానికి వెళ్లి నవగ్రహాలకు 11 ప్రదక్షిణాలు చేయండి.

సింహరాశి:గృహా కొనుగోలు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ మాట తీరు వల్ల అందరూ మిమ్మల్ని ఆదరిస్తారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. లాభాలు కలుగుతాయి. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. ఆత్మీయ కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఇద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అన్యోన్యంగా ఉంటారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు.
పరిహారాలుః ఈరోజు కామాక్షి అమ్మవారిని ఆరాధించండి.

కన్యారాశి:నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు !

ఈరోజు ఆనందకరంగా ఉంటుంది. మీ మాట తీరు వల్ల అందరూ మిమ్మల్ని ఆకర్షిస్తారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు. వ్యాపారాల్లో లాభాలు కలుగుతాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. ఉత్తమ విద్యార్థిగా పేరు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. వివాహాది నిశ్చయతాంబూలాలు అనుకూలిస్తాయి. చేపట్టిన ప్రతి పనిని అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.
పరిహారాలుః ఈ రోజు అన్నపూర్ణ అమ్మవారిని ఆరాధించండి.

తులారాశి:ప్రయాణ లాభాలు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో ఉన్నత శ్రేణి మార్కులు పొందుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ఉత్తమ అవార్డులు పొందుతారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో లాభాలు అనుకూలిస్తాయి. ప్రయాణ లాభాలు కలుగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు.
పరిహారాలుః ఈరోజు లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

వృశ్చిక రాశి:విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు !

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. తక్కువ మాట్లాడే వారు ఎక్కువ పని చేస్తారు. గతంలో పూర్తి కాని పనులను తిరిగి పూర్తి చేస్తారు. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. ఖర్చులకు దూరంగా ఉంటారు. రుణ బాధలు తీరిపోతాయి. ధన లాభం కలుగుతుంది. వాహనాలను కొనుగోలు చేస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. అనారోగ్యానికి దూరంగా ఉంటారు. వ్యాపారాల్లో ఆర్థికాభివృద్ధి మెరుగుపడుతుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో గొప్ప పదోన్నతులు పొందుతారు.
పరిహారాలుః ఈరోజు శ్రీ గణేశ స్తోత్రం పారాయణం చేసుకోండి.

ధనస్సు రాశి:శుభవార్తలు వింటారు !

ఈ రోజు బాగుంటుంది. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. అప్పుల బాధలు తీరిపోతాయి. ధన లాభం కలుగుతుంది. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు పొందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సంతోషంగా ఉంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
పరిహారాలుః శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి.

మకర రాశి:విహార యాత్రలు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. ప్రయాణ లాభాలు కలుగుతాయి. విహార యాత్రలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. వ్యాపారాల్లో లాభాలు. వాహనాలను కొనుగోలు చేస్తారు. గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. కాంట్రాక్టు ఉద్యోగులకు పర్మినెంట్ అవుతుంది. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం పొందుతారు.
పరిహారాలుః దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి.

కుంభరాశి:ప్రమాదాల నుంచి బయట పడతారు !

ఈ రోజు బాగుంటుంది. అన్ని రకాల ప్రమాదాల నుంచి బయట పడతారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. వ్యాపారాలను విస్తరించు కుంటారు. సోదరులతో కలిసి మెలిసి ఉంటారు. చేపట్టిన ప్రతి పనిని ఇష్టంతో అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. క్రొత్త ఇంటిని కొనుగోలు పెడతారు.
పరిహారాలుః ఈరోజు లలితా చాలీసా పారాయణం చేసుకోండి.

మీన రాశి:కార్యాలయాల్లో ప్రమోషన్లు !

ఈ రోజు బాగుంటుంది. అవసరానికి డబ్బులు అందుతాయి. అనవసర ఖర్చులకు దూరంగా ఉంటారు. ధన యోగం కలుగుతుంది. సోదరులతో సఖ్యతగా ఉంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ప్రమోషన్లు కలుగుతాయి. వ్యాపార విస్తరణలో ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు.

పరిహారాలుః కామాక్షి అమ్మవారిని ఆరాధించండి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news