మే 15 ఆదివారం రాశి ఫలాలు..

ఆదివారం ఏ రాశి వాళ్ళకు మంచి ఫలితం ఉంటుంది అనేది చుద్దాము..

మేషం

ఎప్పటి నుంచి ట్రై చేస్తున్న రుణప్రయత్నాలు ఈరోజు  ఫలిస్తాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు. స్త్రీలకు స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి..బంధు మిత్రులతో గొడవలు పడే అవకాశం ఉంది.. జాగ్రత్తగా ఉండాలి.

horoscope

మిథునం

పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తిచేసుకోగలుగుతారు. పిల్లల ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తిరీత్యా గౌరవ, మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి..దైవదర్శనాలు చేస్తారు.

కర్కాటకం

ఈరోజు చాలా మంచి రోజు..ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు లభిస్తాయి. బంధు, మిత్రులను కలుస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.ఉద్యొగాలలొ మంచి ఫలితాలు ఉంటాయి.

సింహం

అనుకున్న పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. మనల్ని చాలా మంచి మోసం చేయాలనీ అనుకుంటారు.అలాంటి వారి నుంచి జాగ్రత్త ఉండాలి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. నూతన కార్యాలు ప్రారంభించకూడదు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.ఏదైనా చేసే ముందు ఆచి తూచి చేయడం మంచిది

కన్య

ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు. రుణబాధలు తొలగిపోతాయి. శత్రుబాధలు ఉండవు. ఈ రోజు చాలా మంచి రోజు..

తుల

ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. స్త్రీల మూలకంగా శతృబాధలను అనుభవిస్తారు. మర్చిపోవాలని అనుకున్న ఏదొక విషయం మనస్తాపానికి గురిచేస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. పగ సాధించే ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది.

వృశ్చికం

గౌరవ మర్యాదలకు లోపం ఉండదు. అనవసర వ్యయప్రయాసలు ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మానసిక ఆందోళనతోనే కాలం గడుపవలసి వస్తుంది. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. శారీరకంగా బలహీనులవుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు..మంచి ఫలితాలను అందుకుంటారు.

ధనుస్సు

సమాజంలో గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. మంచి ఆలోచనలను కలిగి ఉంటారు. బంధు, మ్రితులు గౌరవిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు.. గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తారు..ఈరోజు ప్రశాంతంగా గడుపుతారు..

మకరం

కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. మానసిక బాధలతో ఇబ్బంది పడుతారు. సోమరితనం ఆవహిస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తారు. కొన్ని మంచి అవకాశాలను కోల్పోతారు. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉండవు..ఈరోజు కొద్ది నిరాశ ఉంటుంది..

కుంభం

ధర్మకార్యాలు చేయడంలో ఆసక్తి పెరుగుతుంది. దైవదర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. పేరుప్రతిష్ఠలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు..నిరుద్యొగులకు మంచి వార్తలు వింటారు.

మీనం

అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. వృత్తి ఉద్యోగరంగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి. రుణప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది..శుభకార్యాలలో పాల్గొంటారు.. ఈరోజు మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది..