నవంబర్ 10 మంగళవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

నవంబర్‌-10- ఆశ్వీయుజమాసం- మంగళవారం.

మేష రాశి:ఈరోజు ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోండి !

ఈరోజు విశ్రాంతి తీసుకోండి. పనిపై శ్రద్ధ పెట్టండి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోండి. ఇష్టమైన వారిని కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. మీరు ఎంచుకున్న రంగంలో విజయం సాధిస్తారు. అకస్మాత్తుగా మీ పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది. ఆఫీస్ లో అనుకూల వాతావరణం. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. ప్రయాణాలు చేయకండి.

పరిహారాలు: నవగ్రహారాధన చెప్పుకోదగ్గ సూచన. దీనివల్ల మంచి జరుగుతుంది.

todays horoscope

 

 

 వృషభ రాశి:ఈరోజు ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది !

ఈరోజు తీరిక లేకుండా పని చేస్తారు. విశ్రాంతి దొరుకుతుంది. అసంపూర్తిగా ఉన్న పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ఏదైనా పని లేదా ప్రాజెక్టు ప్రారంభించే ముందు తగు జాగ్రత్తలు తీసుకోండి. వృత్తి ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది. ఈరోజు వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.

పరిహారాలు: ఈ రాశివారు కుజ గ్రహారాధన ఎర్రని పూలతో అమ్మవారిని ఆరాధించిన చేస్తే మంచి ఫలితాలు.

 

 మిధున రాశి:ఈరోజు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త.

ఈరోజు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. ఆఫీసులో పనిపై శ్రద్ధ పెట్టండి. వ్యాపారానికి సంబంధించి అనుకూలత పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. తొందరపాటు పనికిరాదు. వివాదాలకు తగాదాలకు దూరంగా ఉండండి. పిల్లలు మీకు సంతోషాన్ని కలిగిస్తారు. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది.

పరిహారాలు: ఈ రాశివారు దుర్గాదేవి ఆరాధన చేస్తే అనుకూల ఫలితాలు వస్తాయి.

 

కర్కాటక రాశి:ఈరోజు తగాదాలకు దూరంగా ఉండండి !

ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఇంట్లో, బయట సమయాన్ని బ్యాలెన్స్ చేసుకోండి .చిన్నచిన్న ఆందోళనలో ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తారు. వీలైనంత వరకు తగాదాలకు దూరంగా ఉండండి. ప్రయాణం తప్పనిసరి అయితే చేయండి లేకుంటే వాయిదా వేసుకోండి. ఆరోగ్యం బాగుంటుంది, వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది పరిహారాలుః శివకవచం పారాయణం చేయండి.

 

సింహరాశి:ఈరోజు ఉద్యోగప్రయత్నం కలసివస్తుంది !

ఈ రోజు ప్రశాంతంగా ఉండండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి కలిసివస్తుంది. చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తారు. కుటుంబం లో గౌరవం పెరుగుతుంది. పాత స్నేహితులు సహాయం అందిస్తారు. ప్రయాణ అవకాశాలున్నాయి. ఆర్థికంగా పర్వాలేదు. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. ఈరోజు నీకు అదృష్టం కలిసి వస్తుంది.

పరిహారాలు: దుర్గాదేవి దగ్గర దీపారాధన చేయండి.

 

కన్యారాశి:ఈరోజు చాలా బిజీగా ఉంటారు

ఈ రాశివారు ఈరోజు కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వండి, కుటుంబం కోసం సమయాన్ని కేటాయించండి. ఈరోజు చాలా బిజీగా ఉంటారు, విశ్రాంతి లభించదు. ఆరోగ్యం జాగ్రత్త. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పెద్దల సలహాలు సంప్రదింపులు వల్ల మంచి జరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. పిల్లలు మీకు సంతోషం. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది.

పరిహారాలు ఈ రాశివారు నవగ్రహ స్తోత్రం పారాయణం చేస్తే మంచి ఫలితం.

 

తులారాశి:ఈరోజు మీరు చేసే పనిపై దృష్టి పెట్టండి !

ఈరోజు మీరు చేసే పనిపై దృష్టి పెట్టండి. మీ శత్రువులు మీకు హాని చేయాలని ప్రయత్నాలు చేస్తుంటారు జాగ్రత్తగా ఉండండి. ఆఫీసులో శ్రద్ధతో పనిచేయండి. ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త మీ వస్తువులు దొంగిలించబడిన అవకాశం ఉంది. ఆరోగ్యం కోసం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన రోజు. వైవాహిక జీవితం పర్వాలేదు.

పరిహారాలు: ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం, హనుమాన్ గుడి ప్రదక్షిణలు చేయండి.

 

వృశ్చిక రాశి:ఈరోజు కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశముంది !

ఈ రాశి వారు బాధ్యతను నెరవేర్చడంలో కొన్ని ఇబ్బందులు పడతారు. అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. భార్య వైపు నుంచి కొన్ని ఇబ్బందులు కలగవచ్చు. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశముంది. ఆరోగ్యం జాగ్రత్త. ప్రయాణంలో మీ వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండండి. వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది.

పరిహారాలు: హనుమాన్ దేవాలయంలో తమలపాకులతో పూజ లేదా సింధూర  ధారణ చేయండి.

 

ధనస్సు రాశి:ఈరోజు కుటుంబంలో సంతోషం !

ఈరోజు పనులు ఒక్కొక్కటిగా పూర్తి చేయండి. మీ సోదర సోదరీల సహకారం అందిస్తారు. కుటుంబంలో సంతోషం, ఆరోగ్యం బాగుంటుంది. ఇంటి నిర్వహణ అంతా మీ మీద పడుతుంది. బంధువుల రాక. ప్రయాణం చేస్తే కలిసి వస్తుంది. వైవాహిక జీవితం బాగుంటుంది, సంతానానికి సంబంధించి శుభవార్త అందుకుంటారు.

పరిహారాలు: ఈ రాశి వారు దుర్గాదేవి ఆరాధన చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.

 

  మకర రాశి:ఈరోజు ప్రశంసలు అందుకుంటారు !

ఈరోజు మీ పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. తీరిక లేకుండా పని చేస్తారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త ముఖ్యంగా మూలమలుపు వద్ద జాగ్రత్త. వివాదాలకు దూరంగా ఉండండి. ఆఫీసులో మీ తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది. సరైన సమయంలో ఆహారం తీసుకోండి. ప్రయాణాలు కలిసి వస్తాయి. పిల్లల వల్ల మీకు సంతోషం కలుగుతుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

పరిహారాలు: ఈ రాశి వారు శని గ్రహ ఆరాధన, నల్లటి పూలతో ప్రదక్షిణాలు చేసి నవగ్రహాలకు నమస్కారం చేయండి.

 

కుంభరాశి:ఈరోజు శుభవార్తలు వింటారు !

ఈరోజు మీ బంధువుల నుండి శుభవార్తలు వింటారు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు దీని వల్ల లాభాలు పొందుతారు. ఆదాయంలో వృద్ధి. స్నేహితుల వల్ల సౌఖ్యం సహాయం అందుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. పిల్లల చదువు పై దృష్టి పెట్టండి. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది.

పరిహారాలు ఈ రాశి వారు శివాలయంలో ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి

 

మీన రాశి:ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి !

ఈ రాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలు ఉంటాయి. అనుకోకుండా ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. ఈరోజు కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగానికి సంబంధించిన ప్రయత్నాలు సఫలం అవుతాయి. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. పని మీద దృష్టి పెట్టండి. పిల్లల ఆరోగ్యం జాగ్రత్త. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది.

పరిహారాలు హనుమాన్ చాలీసా పారాయణం, సింధూరం పెట్టుకోవడం మంచి ఫలితాన్నిస్తుంది.

 

  • శ్రీ