కాసేపట్లో దుబ్బాక కౌంటింగ్..గెలుపుపై ధీమాతో అభ్యర్థులు.

తెలంగాణ సమాజం ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్‌ మరికాసేపట్లో ప్రారంభమౌతోంది..సిద్దిపేట ఇందూరు ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. మొత్తం 14 టేబుల్స్, 23 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. 14 వందల 53 పోస్టల్ బ్యాలెట్, 51 సర్వీస్ ఓట్లు ఉన్నాయ్‌. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, సర్వీస్ ఓట్లు లెక్కిస్తారు. కౌంటింగ్ విధుల్లో 200 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఉప ఎన్నికల్లో 23మంది అభ్యర్థులు పోటీ చేయగా.. లక్షా 64వేల 192 ఓట్లు పోలయ్యాయి. దాదాపు 83 శాతం ఓటింగ్‌ నమోదైంది.


ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటలవకు ఫలితాల ట్రెండ్ వెల్లడయ్యే అవకాశముంది..ఎవరు గెలుస్తారన్న దానిపై క్లారీటి వచ్చే అవకాశం ఉంది..కౌంటింగ్‌ నేపథ్యంలో దుబ్బాక వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ (సీఆర్‌పీసీ) అమలు చేస్తున్నారు. ఫలితాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పారామిలటరీ భద్రతా దళాలను రంగంలోకి దించారు.