వార ఫలాలు: నవంబర్ 5 నుంచి 12 వరకు రాశిఫలాలు..

-

November 4 to 11 weekly horoscope

నవంబర్ 5 నుంచి 12 వరకు రాశిఫలాలు

మేష రాశి: ఈ వారం అనుకూలం. ముఖ్య కార్యాలయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. వృథా ప్రయాణాలు ఉన్నాయి. వాణిజ్య పరంగా లాభాలుంటాయి. వ్యవసాయ, నిర్మాణ రంగం, ఇంజనీరింగ్, న్యాయవాద వృత్తిలో ఉన్న వారికి అనకూలంగా ఉంటుంది. ఆర్థిక పరమైన సమస్యలు, ప్రతి విషయంలోనూ ఆలస్యం. ఉద్యోగంలో అస్థిరత, రాజకీయ, కోర్టు వ్యవహారములందు అనానుకూల ఫలితాలు. ఇంటిలో భార్యా పిల్లలతో ప్రతీ చిన్న విషయంలోనూ మనస్పర్థలు. సంగీత, సాహిత్య రంగంలో వారికి నిరాశాజనకంగా ఉంటుంది.ఈ వారం అమ్మవారికి కుంకుమార్చన లేదా దేవాలయ దర్శనం, సూర్యారాధన చేస్తే మంచి జరుగుతుంది.

వృషభ రాశి: ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఇప్పటివరకు పడ్డ శ్రమ ఫలిస్తుంది. ఇంట్లో శుభకార్యాలకు చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఉద్యోగులకు అనుకూల కాలం. స్థిరాస్థి వృద్ధికి అనుకూల కాలం. న్యాయ, ఇంజనీరింగ్ వృత్తిలోని వారికి అనుభవజ్ఞుల సహాయ సహకారాలు అవసరం. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కార్యాలు విఘ్నం కాకుండా గణపతి ప్రార్థన, ఇష్టదేవతారాధన, శివ, విష్ణు దేవాలయ సందర్శన చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

మిథున రాశి: మిశ్రమ ఫలితాలు. అయితే గతంలో చేసిన పూజలు, దానాలు, మంచి వల్ల ప్రస్తుతం శుభం జరుగుతుంది. కొన్ని ఇబ్బందులు ఉన్నా పనులు పూర్తవుతాయి. ఇంట్లో భార్యా పిల్లలతో సౌఖ్యం. సంగీత, సాహిత్య, సినిమా రంగాలలో ఉన్న వారికి ఈ వారం ప్రధానంగా కలిసి వస్తుంది. వస్త్ర, ఫ్యాన్సీ, హోటల్ వ్యాపారంలో ఉన్నవారికి అనుకూలం. ప్రభుత్వ, ప్రైవేటు, కార్పోరేట్ ఉద్యోగంలో ఉన్నవారికి అస్థిరత, రాజకీయ, కోర్టు వ్యవహారముల్లో ప్రతికూల ఫలితాలు. వాహనముల మూలంగా అనవసరమైన ఖర్చులు. పనివారితో ఇబ్బందులు. బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండండి. ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆంజనేయస్వామి దేవాలయ ప్రదక్షిణ, శివారాధన వల్ల మంచి జరుగుతుంది.

కర్కాటక రాశి: గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. పట్టుదలతో పనులు చేయండి. ఈ వారంలో ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం. శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వైద్యవృత్తిలోని వారికి ఆదాయం పెరుగుతుంది. సంగీత, సాహిత్య, సినిమా రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. రచయితలకు, జర్నలిస్టుల వృత్తిలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. సూర్యోదయాన్నే సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయం చదవండి. విష్ణు సహస్రనామ పారాయణం లేదా వినడం కూడా మంచి చేస్తుంది.

సింహ రాశి: ఆర్థిక స్థితి మంచిగా ఉంటుంది. ఉద్యోగ లాభం ఉంది. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు. కుటుంబ సౌఖ్యం. సంగీత, సాహిత్య, సినిమా రంగాలలో ఉన్న వారికి ఈ వారం మంచి జరుగుతుంది. ఆయా వ్యాపారాల్లో ఉన్నవారికి అనుకూలం. ప్రధాన గ్రహాలలో కొంత ప్రతికూలత ఉన్నా దైవబలంతో మంచి జరుగుతుంది. నవగ్రహ ప్రదక్షిణ లేదా స్ర్తోత పారాయణం. అమ్మవారి పూజ లేదా దేవాలయ సందర్శనం వల్ల మంచి జరుగుతుంది.

కన్య రాశి: శుభం జరిగే అవకాశం ఉంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈ వారంలో ప్రయాణాలు కలిసి వస్తాయి. కుటుంబంలో సంతోష వాతావరణం. సంగీత, సాహిత్య, సినిమా రంగాల్లో ఉన్న వారికి అనుకూలం. బంధువులతో సఖ్యత. ఆర్థిక విషయాలల్లో ఆలోచించి అడుగులు వేయాలి. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో ప్రతికూల ఫలితాలు. వివాదాలకు, విమర్శలకు దూరంగా ఉండాల్సిన సమయం. పట్టుదలతో పనులు చేస్తే విజయం సాధిస్తారు. ఇంట్లో దీపారాధన, సూర్య నమస్కారం చేయండి. మీ ఇష్టదైవానికి సంబంధించిన దేవాలయ సందర్శనతో మంచి జరుగుతుంది.

తులారాశి: ఈ వారం అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో అనుకూలత. ఆత్మవిశ్వాసంతో పనులు చేయండి తప్పక విజయం సాధిస్తారు. వ్యాపారం చేస్తున్నవారికి అనుకూల కాలం. షేర్ బిజినెస్, న్యాయ, వైద్య రంగంలో వారికి ఆదాయం పెరుగుతుంది. శుభకార్యాలకు హాజరవుతారు. కుటుంబ సౌఖ్యం. పెద్దలు, అనుభవజ్ఞుల సలహాలతో ముందుకుపోండి. సూర్యనమస్కారాలు, ప్రార్థన, చండీ దీపారాధన చేస్తే మంచిది.

వృశ్చికరాశి: మంచి ఫలితాలు ఉన్నాయి. ఆర్థికంగా మంచిగా ఉంటుంది. శ్రమ అధికమైనా పనులు పూర్తిచేస్తారు. కుటుంబంలో సంతోష వాతావరణం. సాహిత్య, సినిమా రంగాలలో ఉన్న వారికి అవకాశాలు వస్తాయి. వ్యాపారలో ఉన్నవారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు చిన్నచిన్న ఇబ్బందులు ఉన్నాయి. రాజకీయ, కోర్టు వ్యవహారము నందు ప్రతికూల ఫలితాలు ఉంటాయి. శుభవార్తా శ్రవణం. ఈ రాశివారు విష్ణు సహ్రసనామ పారాయణం లేదా శ్రవణం. ఇష్టదేవతారాధనతోపాటు దేవాలయ సందర్శన మంచిచేస్తుంది.

ధనుస్సురాశి: కొంత అనుకూలత ఉంది. పట్టుదలతో పనులు చేసి దేవుడిపై భారం వేయండి మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా పెద్ద మార్పు ఉండదు. చేసే పనుల్లో ఆటంకాలు ఉన్నాయి. అయినా మీ సంకల్ప బలంతో అవి పూర్తవుతాయి. రాజకీయ, కోర్టు వ్యవహారములందు అనుకూల ఫలితాలు. వ్యవసాయం చేసేవారికి ఆనుకూలం. కుటుంబంలో, బంధువర్గం వారితో సంతోషంగా గడుపుతారు. అందరి నుంచి ఆదరింపు ఉంటుంది. షేర్‌బిజినెస్‌లో వారికి కొంత ఇబ్బంది. ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. నవగ్రహరాధాన, పేదలకు దానాలు చేయడం, లక్ష్మీపూజ, వేంకటేశ్వరస్వామి దేవాలయ దర్శనం, ప్రార్థన మంచిచేస్తుంది.

మకరరాశి: ఈ వారం అనుకూలంగా ఉంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ప్రమోషన్‌కు అవకాశం. ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. వివాదాలకు, విమర్శలకు దూరంగా ఉండండి. కిరాణం, ఇంజనీరింగ్, షేర్ వ్యాపారాలలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. ఆంజనేయస్వామి దేవాలయ ప్రదక్షిణలు, సింధూర ధారణ, అమ్మవారికి కుంకుమార్చన లేదా దేవాలయ ప్రదక్షిణ చేస్తే మంచిది.

కుంభరాశి: దైవానుకూలత, శుభ ఫలితాలు ఉన్నాయి. వ్యాపారరంగంలో వారికి అనుకూలంగా ఉంది. సంగీత, సాహిత్య, సినిమా రంగంలో వారికి ఆదాయం పెరుగుతుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండండి. కొత్త పనులు ప్రయతాలు ఫలిస్తాయి. విఘ్నాలు ఉన్నా మీ మానసిక బలంతో వాటిని అధిగమించండి. దేవాలయ సందర్శన, ఇష్టదేవతారాధన, శివుడికి మారేడు పత్రితో పూజ, నమస్కారం వల్ల మంచి ఫలితం లభిస్తుంది.

మీనరాశి: గ్రహానుకూలం. చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో సంతోష వాతావరణం. శుభవార్తా శ్రవణం. స్థిరాస్థి ప్రయత్నాలు లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకూల కాలం. ఆర్థికంగా బాగుంటుంది. రాజకీయ, కోర్టు వ్యవహారాలు ప్రతికూలం. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి దీనికోసం సూర్యారాధన చేయండి. ఇష్టదేవతారాధన, పేదలకు దానధర్మాల మూలంగా మంచి ఫలితాలు లభిస్తాయి.

కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

Read more RELATED
Recommended to you

Latest news