నవంబర్ 5 బుధవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

ఆశ్వీయుజమాసం-నవంబర్‌- 5- గురువారం.

మేషరాశి: ఈరోజు మీ సంతానం ద్వారా సంతోష వార్తలు వింటారు !

ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. చిన్న సమస్యలు వస్తాయి. వీటిని మీ తెలివితో పరిష్కరిస్తారు. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది.  మీ పిల్లల ద్వార విజయం సాధిస్తారు. దీనివల్ల కుటుంబంలో సంతోషం. పనులు సాఫీగా సాగుతాయి. పెండింగ్‌ పనులు పూర్తవుతాయి. మీకిష్టమైన వారితో కలిసి ఆనందంగా ఉంటారు. ఈ రోజు మీకు అదృష్టం బాగుంటుంది. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది.

పరిహారాలుః గురుచరిత్ర పారాయణం చేస్తే అనుకూల ఫలితాలు.

todays horoscope

​వృషభరాశి: ఈరోజు సానుకూల ఫలితాలు సాధిస్తారు !

ఈ రోజు మీకు సానుకూల ఫలితాలు సాధిస్తారు. కుటుంబ జీవితం సంతృప్తితో సాగిపోతుంది. మీరు చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఉమ్మడి వ్యాపారాలు కలసివస్తాయి. అధికారుల నుంచి సహకారం లభిస్తుంది. నూతన ఒప్పందాల ద్వారా మీకు పేరు పెరుగుతుంది. ఈరోజు అదృష్టం కలసివస్తుంది. వైవాహిక జీవితం ఆనందమయంగా సాగిపోతుంది.

పరిహారాలుః శ్రీదుర్గాదేవిని ఆరాధించండి. అనుకూల ఫలితాలు పొందండి.

 

​మిథునరాశి: ఈరోజు ఊహించని వార్తలు వింటారు !

ఈరోజు సమస్యలు వస్తాయి. ఓపికతో వ్యవహరించండి. కొన్నింటిని కోల్పోవలసి వస్తుంది. సంతానం నుంచి శుభవార్త అందుకుంటారు.మీకు అనుకోని చోటునుంచి ఊహించని శుభవార్తలను వింటారు. ఈరోజు వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండటం మంచిది. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది.

పరిహారాలుః దత్తాత్రేయస్వామి ఆరాధన మంచి ఫలితాన్నిస్తుంది.

 

​కర్కాటకరాశి: ఈరోజు శుభఫలితాలు వస్తాయి !

వృత్తిలో అభివృద్ధి. మీ పలుకుబడి పెరుగుతుంది. బాధ్యతలు నెరవేర్చడంలో సంతృప్తిగా ఉంటుంది. మీ ప్రయాణం మీకు మేలు చేకూరస్తుంది. ఈ రోజు గ్రహచారం రీత్యా శుభఫలితాలు సూచిస్తున్నాయి. అంతేకాకుండా గొప్ప ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. సాయంత్రం నుంచి రాత్రి వరకు స్నేహితులు వస్తుంటారు. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది.

పరిహారాలుః శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన చేయడం అనుకూలంగా ఉంటుంది.

 

​సింహరాశి: ఈరోజు పోటీలలో విజయం సాధిస్తారు !

ఈరోజు ఆదాయానికి మించిన ఖర్చులు. కొత్త వనరుల ద్వారా ఆదాయాన్నిసంపాదిస్తారు.మీ మాట వల్ల మంచిపేరు సంపాదిస్తారు.  విద్య,ఉద్యోగ పోటీలో విజయం సాధిస్తారు. సమస్యల కారణంగా మీరు ఎక్కువ ఇబ్బందులు పడుతారు. కానీ చివరకు అన్నిసర్దుకుంటాయి. జ్ఞానేంద్రియాల సమస్యలు రావచ్చు. జాగ్రత్త. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది.

పరిహారాలుః శ్రీదుర్గాదేవి దగ్గర చండీదీపం పెట్టండి.

 

​కన్యరాశి: ఈరోజు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు !

ఈరోజు శుభాలు కలుగుతాయి.  ఉద్యోగ ప్రయత్నాలలో అనూహ్యమైన విజయాన్ని పొందుతారు. మీ పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఈ రోజు మీరు చేపట్టే ఏ పనిలోనైనా విజయం సాధిస్తారు. కోర్టు  వ్యవహారాలు అనుకూలం. అనవసర ఖర్చులు పెరుగుతాయి. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది.

పరిహారాలుః ఇష్టదేవతరాధన చేసి అరటిపండ్లు నైవేద్యం సమర్పిచండి.

 

​తులారాశి: ఈరోజు ఆర్థికంగా బాగుంటుంది !

ఈరాశివారు ఈరోజు విజయాన్ని అందుకుంటారు. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులందరి తగిన సమయం దొరికి ఆనందంగా గడుపుతారు. ఆర్థికంగా బాగుంటుంది. దీనివల్ల మీరు అనుకున్న పనులు/వస్తువులు కొనుగోలు చేస్తారు. దూరప్రయాణాలు వాయిదా వేసుకోండి. ఈరోజు పెద్దల సహకారం వల్ల చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకుంటారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

పరిహారాలుః ఇష్టదేవతరాధన చేయండి. అనుకూల ఫలితాలను పొందండి.

 

​వృశ్చికరాశి: ఈరోజు ఆరోగ్య విషయాలు జాగ్రత్త!

ఈరోజు రాశివారికి అనుకోని సమస్యలు, సవాళ్లు ఎదురవుతాయి. వృత్తిలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీకు సహాయం చేయడానికి కుటుంబ సభ్యులు స్నేహితులు వస్తారు. కొత్తగా ప్రారంభించే వ్యవహారాల్లో విజయాన్ని అందుకుంటారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి.

పరిహారాలుః శ్రీదుర్గాదేవిని, వేంకటేశ్వరస్వామిని ఆరాధించండి.

 

​ధనస్సురాశి: ఈరోజు మానసిక ప్రశాంతతను పొందుతారు !

ఈరోజు రాజకీయరంగంలో వారు ప్రయోజనాలను పొందుతారు. శ్రతువులు మీకు సహకరిస్తారు. అనుకోని అతిథులు వస్తారు.  ఈరోజు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశముంటుంది. మానసిక ప్రశాంతతను పొందుతారు. వీలైనంత వరకు వివాదాలు దూరంగా ఉండటం మంచిది.  ప్రయాణాలు తప్పనిసరి అయితేనే చేయండి. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది.

పరిహారాలుః ఇష్టదేవతరాధన చేసేటప్పుడు ఆవునెయ్యితో దీపం పెట్టండి.

 

​మకరరాశి: ఈరోజు తల్లిదండ్రుల ఆరోగ్యం జాగ్రత్త !

ఈరోజు మీరు ఎంచుకున్నరంగంలో ప్రయత్నాలు ఫలిస్తాయి. మీకు తోటిఉద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది. ఈ రోజు మీకు సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థిక విషయాల్లో విజయాన్ని అందుకుంటారు. జీవనోపాధి తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీరు ఒకరి ఇంటికి రావడం ద్వారా సంతోషంగా ఉంటారు. ఈ రోజు వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. ఆరోగ్యం, ఆహారం విషయాలలోజాగ్రత్త.

పరిహారాలుః శ్రీవేంకటేశ్వరస్వామి వజ్రకవచం పారాయణం చేయండి.

 

​కుంభరాశి: ఈరోజు ఆర్థిక సమస్యలు రావచ్చు !

ఈరోజు ఆరోగ్యం జాగ్రత్త.  చిన్నచిన్న సమస్యలు రావర్చు. దీనివల్ల కొంచెం కష్టంగా ఉంటుంది. దనం విషయంలో సమస్యలు రావచ్చు. వివాదం కారణంగా శత్రుత్వం పెరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వివాదాలకు, ఆవేశాలకు దూరంగా ఉండండి. వీలైనంత వరకు కోపాన్ని నియంత్రించుకోండి. ఓపిక పట్టండి. వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండండి.  అత్యంత సాధారణమైన రోజు. దైవనామస్మరణ చేస్తూ గడపండి.

పరిహారాలుః శ్రీదత్తకవచం, గురుచరిత్ర వంటివి చదవడం, శాంతంగా ఉండటం చేయండి.

 

​మీనరాశి: ఈరోజు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త !

ఈరోజు వివాదాలకు దూరంగా ఉండండి. ఆఫీస్‌లో మీ పని మీరు చేసుకోవడం మంచిది. అనవసర వ్యవహారాలలో తలదూర్చకండి. ఈ రోజు మీరు సంతానం నుంచి సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబంలో వచ్చే ఇబ్బందులు ముగింపునకు రావచ్చు. ఆధ్యాత్మిక ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ప్రయాణంలో జాగ్రత్త వ్యవహరించండి. విలువైన వస్తువులు దొంగతనానికి గురయ్యే అవకాశముంది. వైవాహిక జీవితం సాఫీగానే ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త.

పరిహారాలుః ఇష్టదేవతరాధన,యోగా, ధ్యానం మంచి ఫలితాలను ఇస్తుంది.

 

-శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news