ఏ రాశి వారు ఏ దేవునికి తాంబూలం సమర్పించాలి?

చాలామందికి ఎప్పుడు ఏదో ఒక సమస్య. ముఖ్యంగా వారికి విజయం అందినట్టే అంది అపజయం సొంతం అవుతుంది. దీనికి చాలా కారాణాలు ఉండవచ్చు. వీటిలో ప్రధానం ఈతి బాధలు ఉండవచ్చు. దీనికి పెద్దలు పండితులు ఆయా సందర్భాలలో చెప్పిన పవర్‌పుల్‌ పరిష్కారాలను తెలుసుకుందాం…

todays horoscope

ఏ రాశివారు వారి రాశి ప్రకారం ఏ దేవునికి తాంబూలం సమర్పించాలో దాని వల్ల ఫలితాలు తెలుసుకుందాం…
మేష రాశి వారు.. తాంబూలంలో మామిడి పండును ఉంచి మంగళవారంలో కుమారస్వామిని ప్రార్థిస్తే ఈతిబాధలు తొలగిపోతాయి. వృషభ రాశి వారు తమలపాకులో మిరియాలు ఉంచి మంగళవారం పూట రాహువును స్తుతిస్తే.. కష్టాలుండవు. సుఖసంతోషాలు చేకూరుతాయి. మిథున రాశి వారు తమలపాకులో అరటిపండును ఉంచి బుధవారం ఇష్టదేవతా పూజ చేస్తే.. అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి.

కర్కాటక రాశి వారు.. తమలపాకులో దానిమ్మను ఉంచి శుక్రవారం పూట కాళిమాతను ప్రార్థిస్తే కష్టాలు తీరిపోతాయి. సింహ రాశి వారు.. తమలపాకులో అరటిపండును ఉంచి గురువారం ఇష్టదేవతా పూజను చేయాలి. కన్యారాశి రాశి వారు.. తమలపాకులో మిరియాలు ఉంచి గురువారం ఇష్టదేవతా పూజ చేస్తే.. దుఃఖం దూరమవుతుంది. తులా రాశి రాశి వారు.. తమలపాకులో లవంగంను ఉంచి శుక్రవారం పూట ఇష్టదేవతను స్తుతిస్తే.. అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. వృశ్చిక రాశి వారు.. తమలపాకులో ఖర్జూర పండును ఉంచి మంగళవారం పూట ఇష్టదేవతను పూజిస్తే ఈతిబాధలు తొలగిపోతాయి.

ధనుస్సు రాశి వారు.. తమలపాకులో కలకండను ఉంచి గురువారం పూట ఇష్టదేవతను పూజించినట్లైతే సుఖసంతోషాలు చేకూరుతాయి. మకర రాశి వారు.. తమలపాకులో బెల్లంను ఉంచి శనివారాల్లో కాళిమాతను పూజిస్తే.. కష్టాలు తీరిపోతాయి. కుంభ రాశి వారు.. తమలపాకులో నెయ్యిని ఉంచి శనివారం పూట కాళిమాతను పూజించినట్లైతే.. దుఃఖాలు తొలగిపోతాయి. మీన రాశి వారు.. తమలపాకులో పంచదారను ఉంచి ఆదివారం ఇష్టదేవతను పూజించినట్లైతే సుఖసంతోషాలు చేకూరుతాయి. వీటిని భక్తితో, విశ్వాసంతో ఆచరించి చూడండి. తప్పక మీ బాధలు పోతాయి. ఒకసారి మిస్‌ అయినా రెండోసారి ప్రయత్నం చేయండి తప్పక మీకు మంచి ఫలితాలు వస్తాయి.