Rent Agreement vs Lease & License: చాలామంది రెంట్ అగ్రిమెంట్ కి లీజ్ అగ్రిమెంట్ కి మధ్య కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మీరు కూడా ఇదే సమస్య ఎదుర్కొంటున్నారా..? అయితే కచ్చితంగా వీటి తేడాలు ఇప్పుడే చూడాలి. మీరు మీ యొక్క ప్రాపర్టీని అద్దెకు ఇవ్వాలనుకుంటే అద్దెదారుతో ఒప్పందాన్ని కలిగి ఉండాలి. కొన్నిసార్లు భూస్వాములు ఈ పద్ధతిని దాటేస్తారు. అన్ని ఒప్పందాలని నిబంధాల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. లీజ్ అగ్రిమెంట్ లేదా రెంట్ అగ్రిమెంట్ అంటే ఏంటి అనేది చూస్తే.. భూస్వామి చెప్పిన దానికి అంగీకరించి సంతకం చేయబడిన అధికారిక పత్రం. ఇందులో అద్దె, ముందస్తు చెల్లింపు, భూస్వామి ఇచ్చిన నిబంధనలు, షరతులు, ఆస్తి యొక్క ఖచ్చితమైన పరిమాణం ఇతర సంబంధిత వివరాలు ఉంటాయి.
అసలు ఈ అద్దె ఒప్పందం ఎందుకు..?
అద్దెదారులు లేదా లీజుదారుల కాలక్రమమైన విభేదాలు కలిగి ఉండడం సాధారణం. అటువంటి సందర్భాల్లో అదే ఒప్పందం పరిష్కారానికి సూచనగా పనిచేస్తుంది. ఏదైనా ఉంటే నష్టపరిహారం కోసం భూస్వామికి దావా వేయడానికి ఒప్పందం ఉపయోగపడుతుంది. ముందుగా చెప్పిన నిబంధనలను పాటించకపోవడం, అనర్హమైన ప్రవర్తన వంటివి అద్దెదారు లేదా లీజుదారుని ఖాళీ చేయడానికి ఒప్పందం భూస్వామికి ఉపయోగపడుతుంది.
అద్దె ఒప్పందంలో కొన్ని కీలక నిబంధనలు:
ఆక్యుపేసి
పరిమితి
సెక్యూరిటీ
డిపాజిట్
అద్దె కాలవ్యవధి
పరిమితులు
యుటిలిటీలు
మరమ్మతుల
సమాచారం
రెంట్ అగ్రిమెంట్ Vs లీజ్ అగ్రిమెంట్:
అద్దె ఒప్పందానికి 11 నెలల పరిమితితో అగ్రిమెంట్ ఉంటుంది. అదే లీజు అగ్రిమెంట్లో అయితే కనీసం 12 నెలలు కంటే ఎక్కువ ఉండాలి. లీజ్ లేదా లైసెన్స్ రెండూ కూడా పది రోజుల నుండి పది ఏళ్ళ వరకు కలిగి ఉంటాయి. లీజుకి తీసుకున్న వాళ్లు లేదా లీజు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా చనిపోతే వారి వారసుడు దానిని కంటిన్యూ చేయొచ్చు.