మన దేశంలో మన ఆచారాల్లో గ్రహణానికి మతపర ధార్మిక ప్రాధాన్యత ఎంతగానో ఉంటుంది. గ్రహణం సంభవిస్తే గుడులు మూసివేస్తారు ఇంట్లో దర్భతో శుద్ధి చేస్తారు…! గుళ్లలో మూల విరాట్ విగ్రహాలకు పూజలు నిలిపివేస్తారు. గ్రహణం ముగిసేవరకు సూతకం పాటించి ఆపై ఇంటిని శుద్ధి చేసుకొని దేవుడికి పూజలు తిరిగి ప్రారంభిస్తారు. ఇది మన దేశ సాంప్రదాయం ముఖ్యంగా హిందువులు ధార్మిక విలువలు ఉన్నవారు ఇవన్నీ పాటిస్తారు. సాధారణంగా గ్రహణం వచ్చిందంటే హిందువులు ఈ నియమాలన్నీ పాటిస్తారు కానీ నేడు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడినప్పటికీ ఇవన్నీ పాటించనక్కర్లేదు. నేడు భూమి సూర్యుడు చంద్రుడు ఒకే దిశలోకి వచ్చినందుకు ఈ గ్రహణం సంభావిస్తుంది. దాంతో పాక్షికంగా చంద్ర గ్రహం పై సూర్యుడి ఛాయ పడి గ్రహణం ఏర్పడుతుంది. అయితే ఈ గ్రహణం మన దేశం లో కనపడదు. దక్షిణ అమెరికాలో, ఆఫ్రికా రో యూరోప్ లో ఈ గ్రహణం కనపడుతుంది. మన దేశం లో ఈ గ్రహణం కనపడదు కాబట్టి గ్రహణ నియమాలు పాటించనక్కర్లేదు. గుడిలో పూజలు నిర్వహించవచ్చు అన్నీ ధార్మిక నిపుణులు చెబుతున్నారు. గ్రహణ సూతకం గర్భవతి నియమాలు ఉండవు అందరూ చక్కగా తమతమ పనులు చేసుకోవచ్చు. కాగా ఈసారి గ్రహణం ధనుస్సు రాశి లో వచ్చింది. దాంతో ధనుస్సు రాశివారు కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది అని నిపుణుల భావన. ఈ సారి చంద్రగ్రహణం ధనస్సు రాశిలో సంభవించనుంది. ఈ కారణంగా ధనస్సు రాశి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ధనస్సు రాశివారు సూర్యుడిని చంద్రుడిని పారాయణ చేయడం ఉత్తమం.