దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అయోధ్యకు 1,000 రైళ్లు

-

శ్రీరాముని ప్రతిష్ఠాపన జరిగిన మొదటి 100 రోజుల పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అయోధ్యకు 1000 రైళ్లను నడపాలని భారతీయ రైల్వే ప్రణాళిక వేసింది. జనవరి 22న ఆలయ ప్రారంభోత్సవం నిర్వహించి జనవరి 23 నుంచి ఆలయాన్ని భక్తుల కోసం తెరిచి ఉంచనున్నారు. ఈ రైళ్ల నిర్వహణ దానికి 4 రోజుల ముందు అంటే జనవరి 19 నుంచి ప్రారంభమవుతుంది.

రైళ్లు ఎక్కడ నుండి ప్రారంభమవుతాయంటే..

ఈ రైళ్లు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, పూణే, కోల్‌కతా, నాగ్‌పూర్, లక్నో, జమ్మూతో సహా వివిధ నగరాల నుంచి అయోధ్యకు నడుస్తాయి. రాముడి దర్శనం చేసుకున్న భక్తులు ఈ రైళ్లలో తమ స్వగ్రామాలకు చేరుకోవచ్చు. డిమాండ్‌కు అనుగుణంగా రైలు నడుస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
అయోధ్య రైల్వే స్టేషన్‌ను పునరుద్ధరిస్తున్నారు. రోజుకు 50 వేల మంది ప్రయాణించవచ్చు. అలాగే పునరుద్ధరించిన రైల్వే స్టేషన్ జనవరి 15న సేవలకు అందుబాటులోకి రానున్న సంగతి తెలిసిందే.

అదే సమయంలో యాత్రికులు అయోధ్యకు వారి స్వంత చార్టర్డ్ రైలును బుక్ చేసుకోవడానికి కూడా అనుమతింంచారు. ప్రారంభోత్సవం సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు అయోధ్యకు చేరుకుంటారు కాబట్టి, భక్తులకు IRCTC అల్పాహారం, భోజనం సౌకర్యాలను కూడా అందిస్తుంది. రామ జన్మస్థలాన్ని సందర్శించే యాత్రికులు ఇప్పుడు పవిత్రమైన సరయు నదిపై ఎలక్ట్రిక్ కాటమరాన్ (లగ్జరీ బోట్)లో ప్రయాణించవచ్చు. కాటమరాన్ 100 మందికి వసతి కల్పించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

ఆయోధ్య రామ మందిర ఆలయ నిర్మాణానికి 18,000 కోట్ల అంచనా వ్యయంతో లార్సెన్ & టూబ్రో గ్రూప్ ఈ స్మారక ఆలయాన్ని నిర్మించడానికి బాధ్యత వహిస్తుంది. ఈ మహా దేవాలయంలో పూజలు చేసేందుకు ఇప్పటికే దేశం నలుమూలల నుంచి అర్చకులను నియమించారు, అలా నియమితులైన అర్చకుల్లో ఒక విద్యార్థి కూడా ఉన్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన మోహిత్ పాండే వార్త ఇప్పుడు సర్వత్రా వైరల్ అవుతోంది. ఘజియాబాద్‌లోని దుధేశ్వర్ వేద విద్యాపీఠ్ విద్యార్థి మోహిత్ పాండే రామమందిర అర్చకుడిగా ఎంపికయ్యారు. ఈ అర్చక ఉద్యోగానికి సంబంధించి మొత్తం 3,000 మందికి పైగా ఇంటర్వ్యూకు హాజరయ్యారు. చాలా మందిలో, ఆలయ పూజ కోసం 50 మందిని మాత్రమే ఎంపిక చేశారు మరియు వారిలో ఒకరు ఈ విద్యార్థి మోహిత్ పాండే. ఇక్కడ అర్చకులుగా ఎంపికైన అర్చకులకు ఆరు నెలల పాటు శిక్షణ ఇస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version