భూమి వైపు వేగంగా దూసుకొస్తున్న భారీ గ్రహ శకలం.. ఢీకొడుతుందా..?

-

అంతరిక్షం నుంచి భూమిపై అప్పుడప్పుడు సహజంగానే ఉల్కాపాతం జరుగుతుంటుంది. చాలా తక్కువ సైజు ఉండే ఉల్కలు (గ్రహ, నక్షత్ర శకలాలు, దుమ్ము) భూమిపై పడుతుంటాయి. అయితే ఈసారి ఏకంగా ఓ భారీ గ్రహ శకలం భూమి వైపు దూసుకొస్తోంది. ఈ క్రమంలో డిసెంబర్ 26వ తేదీన సదరు గ్రహ శకలం భూమి నుంచి అత్యంత సమీపంగా ప్రయాణిస్తుందని నాసా చెబుతోంది. కాగా ఆ గ్రహ శకలానికి 216258 (2006 డబ్ల్యూహెచ్1) అని పేరు పెట్టారు. ఈ క్రమంలోనే నాసా ఆ శకలానికి సంబంధించి పలు వివరాలను తాజాగా వెల్లడించింది.

భూమి వైపు దూసుకొస్తున్న ఆ భారీ గ్రహ శకలం అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అంత సైజు ఉంటుందని నాసా సైంటిస్టులు తెలిపారు. ఆ శకలం వ్యాసం 240 నుంచి 540 మీటర్ల వరకు ఉంటుందని, అది భూమి వైపు గంటకు 44,172 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుందని తెలిపారు. అయితే ఆ శకలం డిసెంబర్ 26వ తేదీ నుంచి భూమికి అత్యంత సమీపంగా, వేగంగా వెళ్తుందని సైంటిస్టులు చెప్పారు. కానీ దాని ప్రభావం భూమిపై పడుతుందా, లేదా అన్నది చెప్పలేమని వారు తెలిపారు.

అయితే ఇలాంటి భారీ గ్రహ శకలాలు సాధారణంగా ఒక శతాబ్దంలో ఒకటి, రెండు సార్లు మాత్రమే భూమి వైపు వస్తాయని, అవి భూమిని ఢీకొనే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని నాసా తెలిపింది. ఈ క్రమంలోనే ఆ గ్రహ శకలం కూడా భూమిని ఢీకొనే అవకాశం లేదని నాసా తెలియజేసింది. ఇక ఆ గ్రహ శకలం భూమికి ప్రస్తుతం 3.6 మిలియన్ల మైళ్ల దూరంలో ఉందని సైంటిస్టులు తెలిపారు. కాగా రష్యాలోని చెల్యాబింస్క్ అనే ప్రాంతంలో 2013లో 17 మీటర్ల సైజున్న ఓ గ్రహ శకలం భూమిని ఢీకొందని, కానీ ఇప్పుడు భూమి వైపు దూసుకువస్తున్న ఆ గ్రహ శకలం ఇంకా పెద్దదిగా ఉందని సైంటిస్టులు తెలిపారు. మరి ఆ గ్రహ శకలం భూమిని ఢీకొంటుందా, లేదా అన్నది.. మరికొద్ది రోజులు ఆగితే తెలియనుంది..!

Read more RELATED
Recommended to you

Exit mobile version