క‌రోనాను ఆయుర్వేదంతో కొడ‌దాం.. మార్కెట్‌లో విడుద‌లైన ప‌తంజ‌లి ఔష‌ధం..

-

ప్ర‌పంచం మొత్తం క‌రోనా వైర‌స్ మెడిసిన్ కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న వేళ ఇప్ప‌టికే రెండు మూడు కంపెనీలు ఆ ఔష‌ధాల‌ను త‌యారు చేసి వాటి విక్ర‌యాల కోసం కావ‌ల్సిన అనుమ‌తులు పొందాయి. అవి మ‌న దేశానికి చెందిన కంపెనీలే కావ‌డం విశేషం. ఇక ఇంగ్లిష్ మెడిసిన్ కాకుండా కరోనాకు ఆయుర్వేద ఔష‌ధం కూడా సిద్ధ‌మైంది. ప్ర‌ముఖ యోగా గురువు బాబా రాందేవ్ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న ప‌తంజ‌లి ఆయుర్వేద గ్రూప్ క‌రోనాకు ఆయుర్వేద మెడిసిన్‌ను విడుద‌ల చేసింది.

కరోనా ఆయుర్వేద ఔషధం కరోనైల్(Coronil)ను హరిద్వార్‌ లోని పతంజలి యోగ్ పీఠ్‌లో విడుద‌ల చేశారు. ప‌తంజలి సీఈవో ఆచార్య బాల‌కృష్ణ ఆ ఔష‌ధాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్లు ఇది వ‌ర‌కే ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలో చెప్పిన‌ట్లుగానే ఆయ‌న ఆ ఔష‌ధాన్ని మార్కెట్‌లో అందుబాటులో ఉంచారు. అశ్వ‌గంధ‌తోపాటు ప‌లు ఇత‌ర ఆయుర్వ‌ద మూలిక‌లు క‌లిపి త‌యారు చేసిన ఆ ఔష‌ధం ఇప్ప‌టికే 100 శాతం విజ‌య‌వంత‌మైన ఫ‌లితాల‌ను ఇచ్చింద‌ని స్వ‌యంగా బాబా రాందేవ్ గ‌తంలోనే చెప్పారు. గ‌త వారం కింద‌టే ఆయ‌న క‌రోనా ఆయుర్వేద ఔష‌ధాన్ని విడుద‌ల చేస్తామ‌ని తెలిపారు. అన్న‌ట్లుగానే మంగ‌ళ‌వారం ఆ ఔష‌ధం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది.

ప‌తంజ‌లి విడుద‌ల చేసిన క‌రోనా ఆయుర్వేద ఔష‌ధం కరోనైల్ (Coronil) కేవ‌లం 5 నుంచి 14 రోజుల్లోనే క‌రోనాను పూర్తిగా న‌యం చేస్తుంది. ఈ మేర‌కు ఆచార్య బాల‌కృష్ణ గ‌తంలో వివ‌రాల‌ను తెలిపారు. ఈ ఔష‌ధానికి సంబంధించిన క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌లో భాగంగా పేషెంట్లు 5 నుంచి 14 రోజుల వ్య‌వ‌ధిలో క‌రోనా నుంచి కోలుకున్నార‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version