స్పేస్ సెంటర్ ను తొలగించేందుకు మస్క్‌కు నాసా కాంట్రాక్ట్‌

-

ఈ దశాబ్దం చివరికల్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)ను కూల్చివేయనున్నారు. ఇందుకోసం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రణాళికలు షురూ చేసింది. ఐఎస్‌ఎస్‌ను కూల్చేందుకు ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌తో 843 మిలియన్‌ డాలర్లతో (అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.7000 కోట్లకు పైమాటే) డీల్ కుదుర్చుకుంది.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం మానవ నివాసయోగ్యమైన, మానవ నిర్మిత ఉపగ్రహం. దీని తొలిభాగాన్ని 1998లో ప్రారంభించి.. దశలవారీగా విస్తరించారు. అమెరికా, రష్యా, జపాన్‌, ఐరోపా, కెనడా సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తుంటాయి. అనేక మంది శాస్త్రవేత్తలు భూమి నుంచి వెళ్లి కొన్ని నెలల పాటు ఇందులో పరిశోధనలు సాగిస్తుంటారు భూమికి సగటున 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న దిగువ కక్ష్యలో ఇది పరిభ్రమిస్తుంది. భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి 93 నిమిషాలు పడుతుంది. అంటే రోజుకు 15.5 సార్లు భూమిని చుట్టేస్తుందన్న మాట. . దీని జీవితకాలం 2030 వరకు ఉండగా.. ఆ తర్వాత దీన్ని తొలగించనున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా నాసా ఆ దిశగా అడుగులు వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news