న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా అమెజాన్ మెగా శాల‌రీ డేస్ సేల్‌..!

-

నూత‌న సంవ‌త్స‌రాన్ని పుర‌స్క‌రించుకుని ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ జ‌న‌వ‌రి 1 నుంచి మెగా శాల‌రీ డేస్ సేల్‌ను నిర్వ‌హించ‌నుంది. కొత్త సంవ‌త్స‌రంలో సేల్స్ పెంచుకునేందుకు, న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా ఈ సేల్‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు అమెజాన్ తెలిపింది. మెగా శాల‌రీ డేస్ సేల్‌లో భాగంగా ఎల‌క్ట్రానిక్ వ‌స్తువులు, టీవీలు, ఫ‌ర్నిచ‌ర్‌, గృహోప‌క‌ర‌ణాలు, స్పోర్ట్స్‌, ఆటో ప్రొడ‌క్ట్స్‌, బొమ్మ‌లు త‌దితర అనేక వ‌స్తువుల‌పై ఆఫ‌ర్లు, రాయితీల‌ను అందివ్వ‌నున్నారు.

amazon to host mega salary days sale on the occasion of new year

జ‌న‌వ‌రి 1 నుంచి 3వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న ఈ సేల్‌లో భాగంగా భారీ ఉప‌క‌ర‌ణాల‌పై 40 శాతం వ‌ర‌కు, వాషింగ్ మెషిన్ల‌పై 35 శాతం వ‌ర‌కు, ఏసీల‌పై 35 శాతం వ‌ర‌కు రాయితీల‌ను అందివ్వ‌నున్నారు. అలాగే మైక్రో వేవ్ ఓవెన్ల‌పై 40 శాతం వ‌ర‌కు, టీవీల‌పై 30 శాతం వ‌ర‌కు డిస్కౌంట్ల‌ను అందిస్తారు.

బ్యాంక్ ఆఫ్ బ‌రోడా క్రెడిట్ కార్డుల‌ను క‌లిగి ఉన్న‌వారు 10 శాతం ఇన్‌స్టంట్ పొంద‌వ‌చ్చు. శాంసంగ్‌, ఎల్‌జీ, వ‌ర్ల్ పూల్‌, ఐఎఫ్‌బీ, గోద్రెజ్ కంపెనీల‌కు చెందిన వ‌స్తువుల‌పై ఆఫ‌ర్ల‌ను అందిస్తారు. ఇక సేల్ వ‌ర‌కు మ‌రిన్ని ఆఫ‌ర్ల‌కు చెందిన వివ‌రాల‌ను వెల్ల‌డిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news