యాపిల్ యూజ‌ర్ల‌కు గుడ్ న్యూస్‌.. త‌గ్గ‌నున్న రిపేర్ల ఖ‌ర్చులు..!

-

సాఫ్ట్‌వేర్ సంస్థ యాపిల్ త‌న యూజ‌ర్ల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. త‌న ఇండిపెండెంట్ రిపేర్ ప్రొవైడ‌ర్ ప్రోగ్రామ్‌ను మ‌రిన్ని దేశాల‌కు విస్తరిస్తున్న‌ట్లు తెలిపింది. ఆ దేశాల్లో భార‌త్ కూడా ఉంది. ఈ కార్య‌క్రమం ఇప్ప‌టికే అమెరికాలో అందుబాటులో ఉండ‌గా దాన్ని ఇత‌ర దేశాల్లోనూ అందించ‌నున్న‌ట్లు తెలిపింది. దీని వ‌ల్ల యాపిల్ ప్రొడ‌క్ట్‌ల‌ను వాడే యూజ‌ర్ల‌కు రిపేర్ల ఖ‌ర్చులు త‌గ్గుతాయి.

apple expands its Independent Repair Programme

ఈ ప్రోగ్రామ్ వ‌ల్ల మొబైల్ రిపేర్ టెక్నిషియ‌న్ల‌కు యాపిల్ నుంచి ఉచిత శిక్ష‌ణ‌, రిపేర్ మాన్యువ‌ల్స్ ల‌భిస్తాయి. వారు శిక్ష‌ణ పొంద‌వ‌చ్చు. అలాగే క‌స్ట‌మ‌ర్ల‌కు యాపిల్ ప్రొడ‌క్ట్‌ల‌కు చెందిన స్పేర్ పార్ట్‌ల‌ను విక్ర‌యించ‌వ‌చ్చు. వారు యాపిల్ ప్రొడ‌క్ట్‌ల‌ను రిపేర్ చేయ‌వ‌చ్చు. దీని వ‌ల్ల క‌స్ట‌మ‌ర్ల‌కు మ‌రిన్ని ఎక్కువ మొబైల్ రిపేర్ సెంట‌ర్ల‌లో సేవ‌లు ల‌భిస్తాయి. వారు యాపిల్ ప్రొడ‌క్ట్‌ల రిపేర్ల కోసం ఎక్కువ దూరం ప్ర‌యాణించాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. దీని వ‌ల్ల రిపేర్ల ఖ‌ర్చులు త‌గ్గుతాయి. ఈ క్ర‌మంలో యాపిల్ అనేక దేశాల‌కు ఈ కార్య‌క్ర‌మాన్ని విస్త‌రించాల‌ని చూస్తోంది.

భార‌త్‌తోపాటు ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, బ్రెజిల్‌, హాంగ్ కాంగ్‌, ఇండోనేషియా, జ‌పాన్‌, కొరియా, మ‌లేషియా, న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌, సౌదీ అరేబియా, సింగ‌పూర్‌, సౌతాఫ్రికా, శ్రీ‌లంక‌, యూఏఈ వంటి అనేక దేశాల్లో యాపిల్ త‌న ఇండిపెండెంట్ రిపేర్ ప్రొవైడ‌ర్ ప్రోగ్రామ్‌ను అందుబాటులోకి తేనుంది. ఇందులో మొబైల్స్‌ను రిపేర్లు చేసే టెక్నిషియ‌న్లు ఎవ‌రైనా స‌రే ద‌ర‌ఖాస్తు చేసుకుని ఉచితంగా శిక్ష‌ణ పొంద‌వ‌చ్చు. అయితే వారంటీ క‌లిగిన యాపిల్ ప్రొడ‌క్ట్‌ల‌కు మాత్రం రిపేర్ల కోసం క‌స్ట‌మ‌ర్లు యాపిల్ ఆథ‌రైజ్డ్ స‌ర్వీస్ సెంట‌ర్ల‌కే వెళ్లాల్సి ఉంటుంది. మిగిలిన వారు ఇతర రిపేర్ సెంట‌ర్ల‌కు వెళ్ల‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news