మీ జీవితం సంతృప్తిగా సాగుతుందా? ఒక్కసారి చెక్ చేసుకోండి..

-

సంతృప్తి.. మనసుకు సంబంధించినది. దీనికి డబ్బులతో పనిలేదు. జీవితాన్ని ఆస్వాదించే వాళ్ళందరూ సంతృప్తిగా బ్రతుకుతారు. మరి జీవితాన్ని ఆస్వాదించలేని ఎక్కడ తప్పు చేస్తున్నారు. చాలా మంది అనుకుంటారు, డబ్బుంటేనే సంతృప్తి దొరుకుతుందని. కానీ అది నిజం కాదు. డబ్బుకి, సంతృప్తికి సంబంధం లేదు. వేల వేల కోట్లున్నా మనసులో సంతోషం లేని వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. డబ్బు సుఖాన్ని ఇస్తుంది. సంతృప్తిని ఇవ్వలేదు. అలా అని డబ్బు ఉంటే సంతృప్తిగా బతకలేమా అని అనుకోవద్దు.

డబ్బుకి, సంతృప్తికి సంబంధం లేదని చెప్పడమే ఇక్కడ ఉద్దేశ్యం. సంతృప్తిగా బతికే వాళ్ళ సంగతి సరే, అసంతృప్తిగా బతికే వాళ్ళు ఎలా ఉంటారు? వారిలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయి? అవి మీలోనూ ఉన్నాయా అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి.

తనకున్న జ్ఞానాన్ని ఇతరులతో పంచుకుంటూ ఇతరులు అందులో నిష్ణాతులుగా ఎదిగితే సంబరపడేవాళ్ళు సంతృప్తిగా ఉంటారు. కానీ, అవతలి వాళ్ళు ఎక్కడ ఎదుగుతారేమో అని తనకు తెలిసిన జ్ఞానాన్ని గుప్పిట్లోనే దాచుకునే వాళ్ళు అసంతృప్తులుగా ఉండిపోతారు. వీళ్ళని భయాలు వెంటాడుతూనే ఉంటాయి.

జీవితాన్ని రొటీన్ గా ఫీల్ అవుతారు. గొప్పదేదో జరుగుతుందని భావిస్తారే తప్ప, అది జరగాలంటే ప్రయత్నం చేయాలని, కాళ్ళు ముందుకు కదపాలని అనుకోరు. అసలా ప్రయత్నమే చేయరు.

ఏదైనా సరే డబ్బుతోనే కొలుస్తారు. లాభం లేనిది రూపాయి పని చేయడానికి ఇష్టపడరు. ఎల్లప్పుడూ ఇతరులని చూస్తూ ఈర్ష్య పడుతూ ఉంటారు. ఎదుటి వాడికి కారుంది నాకు లేదే అని, ఖరీదైన కారుంటే నాకంత ఖరీదు కారు లేదనుకుంటూ కాలం గడుపుతారు.

ఒక విషయంలో అవతలి వాళ్ళు గొప్ప అని ఒప్పుకోరు. అన్నీ నాకు తెలుసు. నేను కాబట్టే ఇంతలా చేయగలిగాను. ఇదే ప్లేస్ లో వేరే వాళ్ళుంటే ఇలా చేసుండేవారు కాదని తమ గురించి తాము గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు.

Read more RELATED
Recommended to you

Latest news