అద్భుతమైన ఫీచర్లతో ఆపిల్ వాచ్ సిరీస్ 5, 7వ జనరేషన్ ఐప్యాడ్‌ల విడుదల..!

-

సాఫ్ట్‌వేర్ సంస్థ ఆపిల్ నిన్నటి తన ఈవెంట్‌లో నూతన ఐఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఆపిల్ తన ఈవెంట్‌లో వాచ్ సిరీస్ 5 నూతన స్మార్ట్‌వాచ్‌ను, 7వ జనరేషన్ నూతన ఐప్యాడ్‌ను కూడా లాంచ్ చేసింది.

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ ఆపిల్ నిన్నటి తన ఈవెంట్‌లో నూతన ఐఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక భారత్‌లో ఆ ఫోన్లను ఈ నెల 27వ తేదీన లాంచ్ చేసి అదే రోజు నుంచి విక్రయాలు చేపడుతారు. అయితే ఆపిల్ తన ఈవెంట్‌లో ఐఫోన్లను మాత్రమే కాకుండా వాచ్ సిరీస్ 5 నూతన స్మార్ట్‌వాచ్‌ను, 7వ జనరేషన్ నూతన ఐప్యాడ్‌ను కూడా లాంచ్ చేసింది. ఈ క్రమంలో వాటిలో ఉండే ఫీచర్లు, వాటి ధరల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

apple watch series 5 and 7th gen ipad launched

ఆపిల్ వాచ్ సిరీస్ 5 స్మార్ట్‌వాచ్‌లో కొత్తగా ఆల్వేస్ ఆన్ రెటీనా డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. గతంలో వచ్చిన ఆపిల్ వాచ్‌లలో ఈ ఫీచర్ లేదు. దీని వల్ల వాచ్ ఎప్పుడూ ఆన్ అయ్యే ఉంటుంది. అయితే పవర్ ఎక్కువగా ఉపయోగించుకుంటుందన్న బెంగ అవసరం లేదు. దాని కోసం వాచ్ లోపల ప్రత్యేక పవర్ మేనేజ్‌మెంట్ ఫీచర్‌ను ఏర్పాటు చేశారు. దీంతో ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే అయినప్పటికీ పవర్ ఎక్కువగా వినియోగం కాదు. తక్కువగా ఉపయోగించుకుంటుంది. అలాగే సిరీస్ 5 వాచ్‌లో బిల్టిన్ కంపాస్, ఎమర్జెన్సీ కాలింగ్, వాచ్ ఓఎస్ 6, 18 గంటల బ్యాటరీ బ్యాకప్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు. కాగా ఈ వాచ్‌కు చెందిన జీపీఎస్ వేరియెంట్ ధర రూ.40,900 ఉండగా, జీపీఎస్+సెల్యులార్ వేరియెంట్ ధర రూ.49,900 గా ఉంది. ఈ నెల 20వ తేదీ నుంచి ఈ రెండు వాచ్ వేరియెంట్లను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయా దేశాల మార్కెట్లలో విక్రయిస్తారు.

ఇక ఆపిల్ 7వ జనరేషన్ నూతన ఐప్యాడ్‌లో 10.2 ఇంచుల డిస్‌ప్లే, ఆపిల్ ఎ10 ఫ్యుషన్ ప్రాసెసర్, 32, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్లు, ఐఓఎస్ 13, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 1.2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ ఎల్‌టీఈ (ఆప్షనల్), టచ్ ఐడీ, 10 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ తదితర ఫీచర్లు యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ ఐప్యాడ్‌కు చెందిన వైఫై మోడల్ ప్రారంభ ధరను రూ.29,900గా నిర్ణయించారు. అలాగే ఈ ప్యాడ్‌కు చెందిన వైఫై+సెల్యులార్ మోడల్ ప్రారంభ ధర రూ.40,900 గా ఉంది. ఇక సెప్టెంబర్ 30వ తేదీ తరువాత ఈ ఐప్యాడ్‌లు వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news