తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేస్తున్నారా…? ఒకటికి పది సార్లు ఆలోచించండి…!

-

ఈ రోజులలో స్మార్ట్ ఫోన్ వాడకం అనేది క్రమంగా పెరిగిపోతుంది. ప్రతీ ఒక్కరు వ్యాపార, ఉద్యోగ, కుటుంబ, వ్యక్తిగత అవసరాల కోసం స్మార్ట్ ఫోన్ ని ఎంచుకుంటున్నారు. ఇక మొబైల్ తయారి సంస్థలు కూడా తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ లను అందిస్తూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. భారత్ లో అయితే ఇంటికొక స్మార్ట్ ఫోన్ కచ్చితంగా ఉంటుంది. అది లేనిదే పూట గడవని పరిస్థితి ఏర్పడింది అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రతీ చిన్న అవసరానికి స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు.

ఇక ఈ క్రమంలో చాలా మంది తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ లు రావడంతో వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఇది అంత మంచిది కాదని సూచిస్తున్నారు టెక్ నిపుణులు… ఇప్పుడు వాట్సాప్, ఫేస్బుక్, యుట్యూబ్, బ్యాంకింగ్ యాప్ లు వంటి వాటి వాడకం ఎక్కువగా ఉంది. ఈ యాప్ ల భద్రత కోసం వాటిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వస్తున్నారు. వినియోగదారులను ఆకట్టుకోవడానికి కూడా సరికొత్త ఫీచర్స్ తో అప్డేట్ చేస్తున్నారు. ఇదే స్మార్ట్ ఫోన్ లకు ఇబ్బందిగా మారిందని టెక్ నిపుణులు అంటున్నారు.. ఆ యాప్ అప్డేట్స్ ని,

తక్కువ ధరలో ఉన్న స్మార్ట్ ఫోన్స్ తట్టుకోలేకపోతున్నాయి. 3 జిబి ర్యాం ఇచ్చినా సరే ఫోన్ వాటి ఫీచర్స్ ని తట్టుకోలేక హాంగ్ అయిపోతున్నాయు. వాటి వాడకం ఎక్కువగా ఉండటంతో ఫోన్ లో వీడియోలు, ఫోటోలు ఇతరత్రా కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. దీనితో తక్కువ ధరకు వచ్చే స్మార్ట్ ఫోన్ హీట్ ఎక్కిపోతున్నాయి. చాలా వరకు ఫోన్లు పెలిపోవడానికి కారణం కూడా ఇదే అంటున్నారు. భవిష్యత్తులో మరిన్ని యాప్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్ కొనే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించండి.

Read more RELATED
Recommended to you

Latest news