బ్లౌపంక్ట్ సైబర్‌సౌండ్ 43 ఇంచుల స్మార్ట్ టీవీ లాంచ్..ఫీచర్లు, ఆఫర్స్..

మార్కెట్ లో కొత్త టెక్నాలజీకి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఒక ప్రోడక్ట్ వచ్చింది అంటే అందుకు ధీటుగా మార్కెట్ లోకి మరో కంపెనీ వస్తువును లాంచ్ చేస్తున్నారు.ముఖ్యంగా స్మార్ట్ టీవీలు.. టీవీ కొనాలని భావించేవారికి ఇప్పుడు చాలా ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. 20 వేల లోపు స్మార్ట్ టీవీని కొనాలని అనుకోనేవారికి మంచి ఆఫర్ అందుబాటులో ఉంది.43 ఇంచుల డిస్‌ప్లేతో పాటు ఏకంగా 40వాట్ల సౌండ్ ఔట్‌పుట్ ఇచ్చే స్పీకర్లను కలిగి ఉన్న ఆండ్రాయిడ్‌ స్మార్ట్ టీవీ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.19,999కే లభ్యమవుతోంది. అలాగే ప్రస్తుతం కార్డు ఆఫర్‌ కింద రూ.1,000 డిస్కౌంట్ పొందే అవకాశం కూడా ఉంది. బ్లౌపంక్ట్ సైబర్‌సౌండ్ 43 ఇంచుల స్మార్ట్ టీవీ..


స్పెసిఫికేషన్లు, ఫీచర్లు..

1920×1080 పిక్సెల్స్ రెజల్యూషన్ ఉండే 43 ఇంచుల Full HD డిస్‌ప్లేతో ఈ బ్లౌపంక్ట్ సైబర్‌సౌండ్ స్మార్ట్ టీవీ వస్తోంది. అంచులు సన్నగా ఉండే బెజిల్‌లెస్ డిజైన్ ఉండండతో లుక్ పరంగా ప్రీమియమ్‌గా కనిపిస్తుంది. 1జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజ్ ఈ టీవీలో ఉంటుంది. క్వాడ్‌కోర్ Cortex-A53 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ టీవీ రన్ అవుతుంది.ఓటీటీ యాప్స్‌కు ఈ టీవీ సపోర్ట్ చేస్తుంది.గూగుల్ ప్లే స్టోర్ నుంచి గేమ్స్,యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అయితే నెట్‌ఫ్లిక్స్‌కు ఈ టీవీ సపోర్ట్ చేయదు. గూగుల్ అసిస్టెంట్, క్రోమ్‌కాస్ట్ సపోర్ట్ ఉంటాయి.బ్లూటూత్, డ్యుయల్ బ్యాండ్ వైఫై వైర్‌లెస్‌ కనెక్టివిటీ ఫీచర్లుగా ఉన్నాయి. అలాగే మూడు HDMI పోర్టులు, 2 USB పోర్ట్‌లు, హెడ్‌ఫోన్ జాక్ ఈ టీవీకి ఉంటాయి.మంచి సౌండ్ క్వాలిటీ కూడా ఉంటుంది.

ధర..
బ్లౌపంక్ట్ సైబర్ సౌండ్ 43 ఇంచుల ఫుల్ హెచ్‌డీ స్మార్ట్ టీవీ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.19,999గా ఉంది. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే ప్రస్తుతం రూ.1,000 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అంటే రూ.18,999కే ఆన్లైన్ లో కొనుగోలు చెయొచ్చు..