‘మేరా రేషన్‌” యాప్‌ పూర్తి వివరాలు

-

మేరా రేషన్‌ యాప్‌ కేంద్రం అందుబాటులోకి తీసుకువచ్చింది. రేషన్‌ సరుకుల విషయంలో ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం మేరా రేషన్‌ యాప్‌ తెచ్చింది.

వన్‌ నేషన్‌… వన్‌ రేషన్‌ కార్డ్‌ విధానం తెచ్చిన కేంద్రం… శుక్రవారం మేరా రేషన్‌ మొబైల్‌ యాప్‌ని ప్రారంభించింది. దీని ద్వారా ముఖ్యంగా వినియోగదారులు… తవదగ్గర్లో ఎక్కడ రేషన్‌ దుకాణం ఉందో గుర్తించగలరు. సాధారణంగా తమ చుట్టుపక్కల రేషన్‌ దుకాణాలు ఎక్కడ ఉన్నాయో స్థానికులకు మాత్రమే తెలుస్తుంది. అలా కాకుండా కొంత మంది పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు తరచూ వెళ్తుంటారు. అటువంటి వారికి ఈ యాప్‌ చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని ద్వారా జాతీయ ఆహార భద్రతా చట్టం లబ్ధిదారులకు రకరకాల సేవలు అందించవచ్చు. ముఖ్యంగా వలస కార్మికులు, ఇతర వ్యక్తులకు ప్రయోజనం కల్పించవచ్చని కేంద్రం తెలిపింది.

‘వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ విధానం ద్వారా కేంద్రం జాతీయ ఆహార భద్రతా చట్టం పథకాలను లబ్ధిదారులందరికీ అందిస్తోంది. ముఖ్యంగా వలస కూలీలు, వారి కుటుంబీకులకు… రేషన్‌ షాపుల ద్వారా… సరుకులు అందించాలని కేంద్రం ఆలోచన. 2019 ఆగస్టులో 4 రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 2020 డిసెంబర్‌ నాటికి 32 రాష్ట్రాలకు విస్తరించారు. అసోం, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, బెంగాల్‌ మాత్రమే మిగిలివున్నాయి. కొన్ని నెలల్లోనే వాటికీ విస్తరిస్తామని‘ అని ఆహార, పౌర సరఫరాల శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే తెలిపారు.

వివరాలు

వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ పథకం ద్వారా 69 కోట్ల మంది లబ్ధిదారులు ప్రయోజనం చేకూరుతోంది. ‘ఈ యాప్‌ని 14 భాషల్లోకి అందుబాటులోకి తేవాలనుకుంటున్నాం. ఎక్కువ మంది వలస కూలీలు ఏ ప్రాంతాలకు వెళ్తున్నారో… అక్కడి లాంగ్వేజీల్లోకి తేవాలనుకుంటున్నాం‘ అని సుధాన్షు పాండే తెలిపారు.

  • ఈ యాప్‌ ద్వారా లబ్ధి్దదారులు రేషన్‌ దుకాణం ఎక్కడుందో తెలుసుకోగలరు.
  • తమకు రావాల్సిన ఆహార ధాన్యాలు, ఇటీవల జరిగిన ట్రాన్సాక్షన్లు, ఆధార్‌ సీడింగ్‌ తెలుసుకోవచ్చు.
  • వలస కూలీలు ఏ ప్రాంతాలకు వలస వెళ్తున్నదీ వివరాలు ఇవ్వచ్చు.
  • యాప్‌పై లబ్ధిదారుల సలహాలు,సూచనలు కూడా ఇవ్వచ్చు.
    ప్రస్తుతం ఈ యాప్‌ ఇంగ్లీష్, హందీలో లభిస్తోంది. యాప్‌ వాడేవారి సంఖ్య పెరిగినా కొద్ది అందులోని సదుపాయాలను కూడా పెంచుతామని అధికారులు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news