ఈ గ్యాడ్జెట్ గురించి విన్నారా..? మనం అరిచినా వినపడదు తెలుసా..?

-

సాధారణంగా మనం ఫోన్లో ఇతరులతో మాట్లాడుతుంటే పక్క వాళ్ళకి వినబడుతూ ఉంటుంది. దీని వల్ల మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళకి కూడా చికాకుగా ఉంటుంది. ఒకసారి మనం ముఖ్యమైన పనుల్లో ఉంటే ఉంటాం ఉంటాం. దీనితో అవతల వాళ్ళకి చెప్పాలన్న విషయం చెప్పు లేకపోతు ఉంటాం. పక్కకు వెళ్లి మాట్లాడే సమయం కూడా ఉండదు.

 

అయితే అలాంటి ఇబ్బందులు నుంచి ఈ గ్యాడ్జెట్ మనల్ని బయటపడేస్తుంది. ఇదే ఈ ఉషా మీ హెడ్ ఫోన్స్. మరి ఇది ఎలా పని చేస్తుంది..? దీని వల్ల కలిగే లాభాలు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. మనం ఎక్కడ ఉన్నా ఎంత మంది జనంలో ఉన్న ఏ సీక్రెట్ అయినా మనం సులభంగా షేర్ చేసుకోవచ్చు.

పైగా పక్క వాళ్ళు ఉంటారు అన్న భయం కూడా ఉండదు. దీనిని మనం మెడలో వేసుకుని యాప్ ని స్మార్ట్ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకుంటే చాలు. ఫోన్ వస్తే ఇయర్ ఫోన్స్ చెవులో పెట్టుకుని మెయిన్ డివైస్ ని పెదవులకి దగ్గరగా ఫిక్స్ చేసుకోవాలి.

దీంట్లో సౌండ్ ఎడ్జస్టబుల్ సిస్టం కూడా ఉంటుంది. ఎంత గట్టిగా మాట్లాడిన సరే ఎదుటి వాళ్ళకి వినపడదు. సులభంగా మనం ఎవరితో ఏం చెప్పాలన్న చెప్పేయొచ్చు. అవుట్ స్పీకర్, మినీ జాక్, మైక్రోఫోన్ వంటి హై టెక్నాలజీతో ఈ డివైజ్ ని చేశారు. మనం ఫోన్ లో ఎవరితో మాట్లాడినా సరే పర్వాలేదు. ఎవరికీ వినిపించదు .పైగా వాల్యూమ్ ని కూడా మనం ఎడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా దీనిని ఉపయోగించి మనం ఎదుటి వాళ్ల తో బాగా మాట్లాడుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news