అన్ని 5G ఫోన్లకు జియో 5G పనిచేస్తుందా..?

-

5జీ టెక్నాలజీ త్వరలోనే ప్రతి ఇంటా అడుగుపెట్టబోతోంది. టెక్నాలజీ చరిత్రలో పెను సంచలనం తీసుకురాబోతోంది. ఈ క్రమంలోనే జియో తన 5జీ సేవలను దీపావళి నుంచి షురూ చేయనున్నట్లు ప్రకటించింది. మరి జియో 5జీ సేవలు ఇప్పటివరకు ఉన్న అని ఫోన్లలో పనిచేస్తుందా అంటే.. 12 సిరీస్ మొబైల్స్ తర్వాత అన్నింటిలోనూ పనిచేస్తుందని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. 5జీ సేవలు అందిస్తామని చెప్పిన జియో.. ఈ క్రమంలో ఎస్ఏ స్టాండ్ అలోన్ సేవలందిస్తామని ప్రకటించింది. మరి ఎస్ ఏ అంటే ఏంటి.. ? మరి ఇప్పటి వరకు ఉన్న 5జీ ఫోన్ల సంగతేంటో తెలుసుకుందామా..?

SA అంటే పూర్తి స్థాయిలో 5జీ నెట్‌వర్క్‌ కోసం అందుబాటులో ఉన్న నెట్‌వర్క్‌. అంటే బేస్‌ స్టేషన్‌ నుంచి రేడియో యాంటెనా వరకు అన్నీ 5జీ స్పెసిఫకేషన్లతో రూపొందిస్తారు. డేటా, వాయిస్‌ 5జీ రేడియోలతో పని చేస్తాయి. అదే NSA అంటే 4జీ కోసం రూపొందించిన లేదా 4జీ ఆధారిత 5జీ సర్వీసు అనుకోవచ్చు. 4జీ ఎక్విప్‌మెంట్‌తో 5జీ సేవలను అందిస్తారన్నమాట. SA నెట్‌వర్క్‌ విషయంలో ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో వేగమూ ఎక్కువగా ఉంటుంది. కానీ, NSA దగ్గరకు వచ్చేసరికి ఖర్చు తగ్గుతుంది, అలాగే వేగమూ తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వాయిస్‌ క్వాలిటీ కాస్త తగ్గే అవకాశం ఉంది అంటున్నారు. అయితే సాంకేతికత ఉపయోగించి SA నెట్‌వర్క్‌కు NSA నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్‌ చేసే అవకాశం ఉందంటున్నారు.

యాపిల్‌ 13 సిరీస్‌ మొబైల్స్‌లో SA 5జీకి సంబంధించినంత వరకూ ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ 12 సిరీస్‌ మొబైల్స్‌లో నేరుగా SA 5జీ వస్తుందా లేదా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

శాంసంగ్‌ మొబైల్స్‌ SA 5జీ సేవలను వినియోగించుకోవచ్చు. అయితే అది అప్‌డేట్‌ రూపంలో వచ్చాకా? లేక అప్‌డేట్‌ రాకపోయినా అనేది తెలియాల్సి ఉంది. కొత్తగా వచ్చిన నథింగ్‌ మొబైల్‌ విషయంలో ఎలాంటి అప్‌డేట్లు లేకుండానే SA 5జీ సేవలు వినియోగించుకోవచ్చు.

వన్‌ప్లస్‌ నుంచి వచ్చిన తొలి నార్డ్‌, నార్డ్‌ సీఈ మొబైల్స్‌లో N 78 బ్యాండ్‌ను వినియోగిస్తున్నారు. దీంతో వీటిలో జియో 5జీ వస్తుందా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు. అయితే వన్‌ప్లస్‌ 8, 8 ప్రో మొబైల్స్ స్పెసిఫికేషన్లు చూస్తే.. ఈ మొబైల్‌ 78 బ్యాండ్‌ను సపోర్టు చేస్తుందని, అయితే SA, NSA మోడ్‌ 5జీ సపోర్టు ఉంటుందని రాశారు. అయితే ఇది నేరుగానా, లేక అప్‌డేట్‌ ద్వారానా అనేది తెలియాలి.

వన్‌ప్లస్‌ 9 సిరీస్‌, 10 సిరీస్‌ మొబైల్స్‌ అన్నీ SA, NSAను సపోర్టు చేస్తాయి అని సమాచారం. నార్డ్‌ 2: 5జీ, నార్డ్‌ సీఈ2 5జీ మొబైల్స్‌ మల్టిపుల్‌ 5జీ బ్యాండ్స్‌తో పని చేస్తాయి.

షావోమి 1111 Lite NE 5G నుంచి షావోమి 12 Pro వరకు అన్ని మోడల్స్‌లో జియో 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి.

రెడ్‌మీ సంగతి చూస్తే.. K50i 5G, Note 11T 5G మొబైల్స్‌ సపోర్టు చేస్తాయి. పోకోకు చెందిన M4 5G నుంచి X4 Pro 5G వరకు అన్ని మోడల్స్‌లో జియో 5జీ SA సేవలు లభిస్తాయి.

రియల్‌ మీ 9i 5G, 9 Pro Plus 5G, 9 Pro 5G, GT సిరీస్‌ మొబైల్స్‌లో జియో 5జీ సేవలు అందుబాటులో ఉంటాయి. అయితే నేరుగా వాడేయొచ్చా లేక.. ఏమైనా ఓటీఏ అప్‌డేట్‌ ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version