వీడియో కాన్ఫరెన్స్‌ యాప్‌ ‘జూమ్‌’కు పోటీగా.. ఫేస్‌బుక్‌ మెసెంజర్‌లో కొత్త టూల్‌..!

-

కరోనా లాక్‌డౌన్‌ వల్ల ప్రస్తుతం చాలా మంది ‘జూమ్’‌ అనే యాప్‌ను వాడుతున్న సంగతి తెలిసిందే. దీని సహాయంతో ఒకేసారి ఎక్కువ మంది ఒకే వీడియో కాల్‌లో మాట్లాడుకోవచ్చు. వర్క్‌ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులు తమ పై అధికారులు, తోటి కొలీగ్స్‌తో మాట్లాడేందుకు, ఇతర యూజర్లు ఈ జూమ్‌ యాప్‌ను ఎక్కువగా వాడుతున్నారు. అయితే ప్రముఖ సోషల్‌ మీడియా సంస్థ ఫేస్‌బుక్‌ జూమ్‌కు పోటీగా మెసెంజర్‌ యాప్‌లో ఓ నూతన టూల్‌ను త్వరలో అందుబాటులోకి తేనుంది. దాని సహాయంతో ఏకంగా ఓకేసారి 50 మంది ఒకే వీడియో కాల్‌లో మాట్లాడుకోవచ్చు.

ఫేస్‌బుక్‌ వ్యవస్థాపక సీఈవో మార్క్‌ జూకర్‌బర్గ్‌ మెసెంజర్‌ యాప్‌లో ‘రూమ్’‌ పేరిట నూతనంగా ఓ టూల్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. మరో వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెసెంజర్‌ యూజర్లందరికీ ఈ టూల్‌ అందుబాటులో ఉంటుందని తెలిపారు. దీంతో ఒకేసారి 50 మంది వీడియో కాల్‌లో మాట్లాడుకోవచ్చని అన్నారు. అందుకు గాను ఒక వ్యక్తి ముందుగా రూమ్‌ను క్రియేట్‌ చేసి.. దాంట్లోకి ఇతరులను ఆహ్వానించవచ్చని తెలిపారు. అయితే అందుకు ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ఉండాల్సిన పనిలేదని, ఫోన్‌ నంబర్‌ ఉంటే చాలని అన్నారు. దాంతో వీడియో కాల్‌కు కనెక్ట్‌ అయి కాన్ఫరెన్స్‌లో పాల్గొనవచ్చని తెలిపారు.

కాగా జూమ్‌ యాప్‌కు విశేష ఆదరణ లభిస్తున్నందునే దానికి పోటీగా ఫేస్‌బుక్‌ ఈ టూల్‌ను అందుబాటులోకి తెస్తోంది. గత డిసెంబర్‌ నెలలో జూమ్‌ యాప్‌ను వాడుతున్న వారి సంఖ్య 10 మిలియన్లు ఉండగా.. ప్రస్తుతం అది 300 మిలియన్లకు చేరుకుంది. ఈ క్రమంలోనే ఆ యాప్‌కు పోటీగా ఇప్పుడు ప్రముఖ సంస్థలు వీడియో కాలింగ్‌ యాప్‌ను లేదా అలాంటి ఫీచర్లను తమ తమ యాప్‌లలో అందించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇక ఫేస్‌బుక్‌ మెసెంజర్‌లోనూ రూమ్‌ అనే టూల్‌ మరో వారం రోజుల్లో యూజర్లకు అందుబాటులోకి రానుంది..!

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version