ఫ్లిప్‌కార్ట్‌లో మే 2 నుంచి బిగ్ సేవింగ్ డేస్ సేల్‌.. ఫోన్లపై త‌గ్గింపు ధ‌ర‌లు..

ఈ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ మ‌రో అద్భుత‌మేన సేల్‌తో ముందుకు వ‌చ్చింది. మే 2 నుంచి 7వ తేదీ వ‌ర‌కు బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను నిర్వ‌హిస్తోంది. ఇందులో అనేక ఉత్ప‌త్తుల‌ను త‌గ్గింపు ధ‌ర‌ల‌కు అందివ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. సేల్‌లో భాగంగా శాంసంగ్‌కు చెందిన గెలాక్సీ ఎఫ్‌62ను రూ.17,999కు, పిక్స‌ల్ 4ఎను రూ.26,999కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఐఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్ లు త‌దిత‌ర అనేక వ‌స్తువుల‌పై ఈ సేల్‌లో డిస్కౌంట్ల‌ను అందివ్వ‌నున్నారు.

flipkart big saving days sale from may 2nd

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో అసుస్ ఆర్‌వోజీ ఫోన్ 3, యాపిల్ ఐఫోన్ ఎక్స్ఆర్‌, ఎంఐ 10టి సిరీస్ ఫోన్లు, రియ‌ల్‌మి ఎక్స్‌7 ప్రొ 5జి, పిక్స‌ల్ 4ఎ, రియ‌ల్‌మి ఎక్స్‌50 ప్రొ, రియ‌ల్‌మి ఎక్స్‌3 సూప‌ర్ జూమ్‌, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్‌62, రియ‌ల్‌మి 7 ప్రొ, రియ‌ల్‌మి 8, గెలాక్సీ ఎఫ్‌41, రెడ్‌మీ నోట్ 9, పోకో ఎం3, రియ‌ల్‌మి సి25, నార్జో 30ఎ, రియ‌ల్‌మి సి21, మోటో ఇ7 ప‌వ‌ర్ ఫోన్ల‌పై డిస్కౌంట్ల‌ను ఇవ్వ‌నున్నారు.

అలాగే ఎంఐ టీవీ స్టిక్స్, అమేజ్‌ఫిట్ వాచ్‌లు, రియ‌ల్‌మి వైర్‌లెస్ ఇయ‌ర్‌బ‌డ్స్‌పై త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందివ్వ‌నున్నారు. ల్యాప్‌టాప్‌ల‌పై 40 శాతం, టీవీల‌పై 70 శాతం రాయితీల‌ను ఇస్తారు. సేల్‌లో ప్ర‌తి రోజూ అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు, ఉద‌యం 8 గంట‌ల‌కు, సాయంత్రం 4 గంట‌ల‌కు ప్ర‌త్యేక డీల్స్ ఉంటాయి. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల‌తో 10 శాతం వ‌ర‌కు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు.