బిగ్ బ్రేకింగ్: ఈటెల రాజేంద్రకు షాక్ ఇచ్చిన కేసీఆర్, శాఖలేని మంత్రిగా ఈటెల

తెలంగాణాలో మంత్రి ఈటెల రాజేంద్ర వ్యవహారం సంచలనంగా మారుతుంది. నిన్న ఆయనపై అవినీతి, భూ కబ్జా ఆరోపణలు రావడంతో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించడం ఆ తర్వాత అధికారులు విచారణ జరపడం అన్నీ కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇక తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఈటెల రాజేంద్రకు వైద్య ఆరోగ్య శాఖను తప్పిస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు.

ఈటెలను వైద్య ఆరోగ్య శాఖ నుంచి తప్పించాలని కేసీఆర్ గవర్నర్ కు లేఖ రాయగా వెంటనే గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఇప్పుడు సిఎం కేసీఆర్ పరిధిలోకి వస్తుంది. భూ కబ్జా ఆరోపణలు ఆ తర్వాత సిఎం కేసీఆర్ కు రైతులు ఫిర్యాదు చేయడం చక చకా జరిగాయి. దీనితో ఇప్పుడు ఈటెల శాఖ లేని మంత్రిగా మిగిలిపోయారు.