గ్రేటర్ నోయిడాలో దారుణం జరిగింది. 35 ఏళ్ళ కరోనా బాధిత మరణించిన తీరు కన్నీరు పెట్టిస్తుంది. బాధితురాలి మృతదేహాన్ని దహన సంస్కారాలకు తీసుకెళ్లేముందు మూడు గంటలకు పైగా కారులో శవం ఉండిపోయింది. గ్రేటర్ నోయిడాలోని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (జిమ్స్) వెలుపల ఈ సంఘటన గురువారం జరిగిందని జాతీయ మీడియా వివరించింది.
గ్రేటర్ నోయిడాలో ఇంజనీర్‌గా పనిచేసే జాగృతి గుప్తాగా కరోనా రావడంతో ఆమె ఆస్పత్రికి వెళ్ళారు. తనస్నేహితుడితో కలిసి ఆమె ఆస్పత్రికి వెళ్ళగా అక్కడ బెడ్ దొరకలేదు. ఆస్పత్రిలో వైద్యులను ఎన్ని విధాలుగా అడిగినా సరే బెడ్ లేదు. చివరకు ఆమె కారులోనే ప్రాణాలు కోల్పోయారు. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె మృతదేహం 3 గంటల పాటు కారులో ఉండటం ఆ ఫోటో బయటకు రావడం సంచలనం అయింది.