ఫ్లిప్‌కార్ట్ లో బిగ్ బిలియ‌న్ డేస్ సేల్‌.. టీవీలు, ఫోన్ల‌పై ఆఫ‌ర్లే ఆఫ‌ర్లు..

ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ 8వ ఎడిష‌న్ బిగ్ బిలియ‌న్ డేస్ సేల్‌ను నిర్వ‌హించ‌నుంది. ద‌స‌రా సంద‌ర్భంగా ప్ర‌తి ఏటా ఈ సేల్‌ను ఫ్లిప్‌కార్ట్ నిర్వ‌హిస్తుంది. వ‌చ్చే నెల‌లో ద‌స‌రా ఉంది క‌నుక అంత‌క‌న్నా 10 రోజులు ముందుగా సేల్ ఉంటుంది. అయితే క‌చ్చిత‌మైన తేదీల‌ను ప్ర‌క‌టించ‌న‌ప్ప‌టికీ ఫ్లిప్‌కార్ట్ మాత్రం సేల్‌లో ఉండే ఆఫ‌ర్ల వివ‌రాల‌ను తెలియ‌జేసింది.

బిగ్ బిలియ‌న్ డేస్ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ సంస్థ యాక్సిస్ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంకుల‌తో భాగ‌స్వామ్యం అయింది. ఈ క్ర‌మంలోనే ఆయా బ్యాంకుల‌కు చెందిన క‌స్ట‌మ‌ర్లు క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల‌తో వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తే అద‌న‌పు డిస్కౌంట్ల‌ను, ఆఫ‌ర్ల‌ను, క్యాష్‌బ్యాక్‌ను పొంద‌వ‌చ్చు. ఇక పేటీఎం కూడా క్యాష్ బ్యాక్ ను అందిస్తోంది. అందుకు గాను సేల్ సంద‌ర్భంగా వినియోగ‌దారులు పేటీఎం వాలెట్ లేదా యూపీఐ ద్వారా కొనుగోళ్లు జ‌ర‌పాల్సి ఉంటుంది.

ఈ సేల్‌లో రియ‌ల్‌మి సంస్థ త‌న మొట్ట మొద‌టి 4కె స్ట్రీమింగ్ స్టిక్ ను లాంచ్ చేసి విక్రయించ‌నుంది. అలాగే ఆడియో ఉత్ప‌త్తులు చాలా త‌క్కువ ధ‌ర‌ల‌కు ల‌భ్యం కానున్నాయి. టీవీలు, ఫోన్ల‌పై కూడా క‌ళ్లు చెదిరే ఆఫ‌ర్ల‌ను అందించ‌నున్నారు.

సౌండ్ బార్ ల‌పై 80 శాతంవ‌ర‌కు డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు. ల్యాప్‌టాప్‌ల‌పై 40 శాతం, వియ‌ర‌బుల్స్‌, ప్రింట‌ర్లు, మానిట‌ర్లు, ఇత‌ర కంప్యూట‌ర్ ఉత్ప‌త్తుల‌పై 50 శాతం, వైర్‌లెస్ ఇయ‌ర్‌బ‌డ్స్ పై 70 శాతం వ‌ర‌కు డిస్కౌంట్ల‌ను పొంద‌వ‌చ్చు. పోకో, రియ‌ల్‌మి, షియోమీ, ఇన్ఫినిక్స్‌, మోటో, వివో కంపెనీల‌కు చెందిన ఫోన్ల‌పై భారీ డిస్కౌంట్ల‌ను అందించ‌నున్నారు.