టిటిడి సంచలన నిర్ణయం : 49 మంది ఉద్యోగులుకు నోటిసులు

తిరుమల : తిరుమల తిరుమల దేవస్థానం ఇఓ జవహర్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. హౌస్ బిల్డింగ్ లోన్ జారి లో అవకతవకల కు పాల్పడారంటు 49 మంది కి షోకాజ్ నోటిసులు జారి చేశారు టీటీడీ ఇఓ జవహర్ రెడ్డి. అయితే 49 మంది ఉద్యోగులకు నోటిసులు జారీ చేయడం టిటిడి చరిత్ర లోనే మొట్ట మొదటిసారి కావడం విశేషం.

నోటిసులు అందుకున్న వారిలో డిప్యూటీ ఇఓ నుంచి అటెండర్ వరకు ఉద్యోగులు అందరూ ఉన్నారు. మరో విడత లో మరి కొంత మంది కి ఉద్యోగులకు నోటిసులు జారి చేసే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం అందుతోంది. కొద్ది రోజులు క్రితం ఆర్జిత సేవా టిక్కేట్ల కుంభకోణం లో ఏడుగురు ఉద్యోగులను డిస్మిస్ చేశారు టీటీడీ ఇఓ జవహర్ రెడ్డి. ఇది ఇలా ఉండగా.. ఇటీవలే తిరుమల దేవస్థానం టికెట్ల స్కామ్ ఘటన లోనూ.. ఏడుగురు ఉద్యోగులను డిస్మిస్ చేశారు ఇఓ జవహర్ రెడ్డి.