ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌.. మ‌రికొద్ది గంట‌లే ఉంది.. త్వ‌ర‌ప‌డండి..!

-

ఈ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఈ నెల 25వ తేదీ నుంచి బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను నిర్వ‌హిస్తున్న విష‌యం విదిత‌మే. ఆ సేల్ గురువారంతో ముగియ‌నుంది. ఈ క్ర‌మంలో సేల్ ముగిసేందుకు మ‌రికొన్ని గంట‌ల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. మ‌రి సేల్‌లో ఉన్న ఆఫ‌ర్లు, డిస్కౌంట్ల వివ‌రాల‌ను ఒక్క‌సారి తెలుసుకుందామా..!

flipkart big saving days sale few hours left hurry

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో యాపిల్‌కు చెందిన ఐఫోన్ 12ను రూ.67,999 ప్రారంభ ధ‌ర‌కు కొనుగోలు చేయ‌వచ్చు. అలాగే రియ‌ల్‌మి 8 ఫోన్ రూ.13,999 ధ‌ర‌కు ల‌భిస్తోంది. ఐఫోన్ 12 మినీ రూ.57,999కు, రియ‌ల్‌మి నార్జో 30 ప్రొ రూ.15,499 ధ‌ర‌కు ల‌భిస్తున్నాయి. ఐఫోన్ ఎస్ఈ (2020 ధ‌ర రూ.28,999 ఉండ‌గా, అసుస్ ఆర్‌వోజీ ఫోన్ 3 ధ‌ఱ రూ.39,999గా ఉంది.

రియ‌ల్‌మి ఎక్స్‌7 మ్యాక్స్ ఫోన్‌ను రూ.26,999కు బ‌దులుగా రూ.24,999కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. అలాగే రియ‌ల్‌మి ఎక్స్50ప్రొ ధ‌ర రూ.30,999గా ఉంది. పోకో ఎక్స్‌3 రూ.15,999కు, యాపిల్ ఐఫోన్ ఎక్స్ఆర్ రూ.37,999కు ల‌భిస్తున్నాయి. అలాగే ఇత‌ర ఫోన్లు, ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల‌పై ఆక‌ట్టుకునే ఆఫ‌ర్ల‌ను అందిస్తున్నారు.

ఇక మోటోరోలా రేజ‌ర్‌, రియ‌ల్‌మి ఎక్స్‌7 ప్రొ 5జి, ఐక్యూ3, రియ‌ల్‌మి ఎక్స్‌3 సూప‌ర్ జూమ్‌, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్‌62, మోటో జి60, రియ‌ల్‌మి 7 ప్రొ, గెలాక్సీ ఎఫ్‌41, రెడ్‌మీ నోట్ 9, గెలాక్సీ ఎఫ్‌12, మోటో ఇ7 ప‌వ‌ర్, నోకియా సి3 ఫోన్ల‌పై కూడా త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందిస్తున్నారు.

బ్లూటూత్ హెడ్‌ఫోన్స్‌పై ఈ సేల్‌లో 60 శాతం వ‌ర‌కు డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు. మానిట‌ర్ల‌పై 45 శాతం, టీవీల‌పై 64 వాతం వ‌ర‌కు రాయితీల‌ను అందిస్తున్నారు. ఐసీఐసీఐ కార్డుల‌తో అయితే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news