గూగుల్ అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుంది. గూగుల్ ద్వారా మనం ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. అయితే మనం ఒక్కోసారి ఫోన్ ని ఎక్కువగా వాడడం వలన ఇబ్బంది పడుతూ ఉంటాం. కంటిపై ఒత్తిడి పడినట్టు ఉంటుంది. అలాంటప్పుడు మనం డార్క్ మోడ్ ని ఉపయోగిస్తూ ఉంటాం. డార్క్ మోడ్ ని ఉపయోగించడం వలన కళ్ళకి ఇబ్బంది రాదు.
గతేడాది డార్క్ మోడ్ ఫీచర్ ని గూగుల్ సెర్చ్ లో అందుబాటు లోకి తీసుకొచ్చింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ డార్క్‌మోడ్‌ను మరింత డార్క్‌గా మార్చనున్నట్లు సమాచారం. డార్క్ మోడ్ ఎనేబుల్ చేస్తే కొన్ని స్క్రీన్లలో గ్రే రంగు లో కనిపిస్తుంది. అప్డేట్ తర్వాత డార్క్ మోడ్ పిచ్ బ్లాక్ రంగు లోకి మారుతుందని తెలుస్తోంది. అయితే ఇది ఇప్పుడు అందరికీ అందుబాటులో లేదు.
కేవలం కొంత మందికే అందుబాటులో వుంది. త్వరలో పూర్తిస్థాయిలో యూజర్లకు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ డార్క్ మోడ్ ని పొందాలి అంటే గూగుల్ సెర్చ్ వెబ్ పేజ్ ఓపెన్ చేసి గూగుల్. కామ్ అని టైప్ చేయాలి. ఆ తరవాత సెట్టింగ్స్ లోకి వెళ్లి అప్పీయరెన్స్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఒకవేళ సెట్టింగ్స్ లో అప్పీయరెన్స్ ఆప్షన్ కనిపించకపోతే అప్పుడు సెర్చ్ సెట్టింగ్స్ లోకి వెళితే కనిపిస్తుంది. ఇలా గూగుల్ ని ఉపయోగించేటప్పుడు ఈ ఫీచర్ ని ఉపయోగిస్తే కంటికి అలసట రాదు