నేటి నుంచి పెరుగుతున్న మెట్రో రైల్ వేగం… మరింత త్వరగా గమ్యస్థానాలకు

-

హైదరాబాద్ వాసులకు ఇది గుడ్ న్యూసే. మరింత త్వరగా గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఏర్పడింది. హైదరాబాద్ మెట్రో రైల్ అందుబాటులోకి రావడంతో సిటీలో కొంతమేర ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడింది. వేగంగా ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం లభించింది. ఇదిలా ఉంటే నేటి నుంచి మెట్రో రైళ్ల వేగం మరింతగా పెరిగింది. ఆదివారం నుంచి ఇది అమలులోకి వచ్చింది. ఇప్పుడున్న వేగం కన్నా మరో 10 కిలోమీటర్ల వేగంతో మెట్రో రైళ్లు పరుగుతీయనున్నాయి. అదనపు వేగంతో ప్రయాణించేందుకు కమిషన్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ నుంచి అనుమతి లభించింది. రైళ్ల వేగం, భద్రతకు సంబంధించి గతనెలలో కమిషన్ ఆఫ్ మెట్రో రైల్వే సేఫ్టీ ఉన్నతాధికారులు పరిశీలించారు. అన్నింటిని పరిశీలించి అదనపు వేగానికి అనుమతి ఇచ్చారు.

ప్రస్తుతం నగరంలో మూడు కారిడార్లలో మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. ప్రస్తుతం 70 కిలోమీటర్ల వేగంతో మెట్రో ట్రైన్స్ నడుస్తుంటే… తాజాగా ఈ రోజు నుంచి గంటకు 80 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయనున్నాయి. అదనపు వేగం వల్ల నాగోల్ – రాయదుర్గం మార్గంలో 6 నిమిషాలు, మియాపూర్, ఎల్బీనగర్ మార్గంలో 4 నిమిషాలు, జేబీఎస్- ఎంజీబీఎస్ మార్గంలో 1 నిమిషం ప్రయాణం సమయం ఆదా కానుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news