వాట్సాప్‌ వెబ్‌లో స్క్రీన్‌ లాక్‌ ఆప్షన్.. ఎలా ఎనేబుల్‌ చేసుకోవాలో తెలుసా..?

చాలా మంది వెబ్‌లో వాట్సాప్‌ వాడుతుంటారు. అయితే అలాగే లాగిన్ అయి మరిచిపోతుంటారు. దీనివల్ల వేరే వాళ్లు మీ చాట్ చూసే అవకాశం ఉంటుంది. ఇలా జరగకుండా వెబ్ వాట్సాప్​కు కూడా లాక్ వేయొచ్చు తెలుసా..? నిజమండీ బాబు వెబ్ వాట్సాప్​లోనూ లాక్ స్క్రీన్ ఫీచర్ అందుబాటులో ఉంది. మాటిమాటికీ క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి లాగిన్‌ అవ్వడానికి విసుగెత్తిపోయే వారు ఈ ఫీచర్​ను యూజ్ చేసుకుని లాక్ వేసుకుని ఇక మీ పని హాయిగా చేసుకోవచ్చు. మరి ఈ ఫీచర్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలంటే..?

  • మొదటగా వాట్సాప్ వెబ్​లో web.whatsapp.com లో క్యూఆర్‌ కోడ్‌తో లాగిన్‌ అవ్వండి.
  • వాట్సాప్ ఓపెన్ కాగానే పైన మూడు చుక్కల గుర్తు మీద క్లిక్‌ చేయండి. అందులో సెటింగ్స్‌లోకి వెళ్లండి.
  • సెటింగ్స్‌లో కిందికి స్క్రోల్‌ చేస్తే లాక్‌ స్క్రీన్‌ ఆప్షన్‌ను కనిపిస్తుంది.. దాన్ని సెలక్ట్ చేసుకోవాలి.
  • స్క్రీన్​పై కనిపించే సూచనలు పాటిస్తూ పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకోవాలి. ఓకే మీద నొక్కితే పాస్‌వర్డ్‌ కన్‌ఫర్మ్‌ అవుతుంది.
  • కా ఆటోమేటిక్‌ స్క్రీన్‌ లాక్‌ టైమింగ్‌నూ ఎంచుకోవచ్చు. ఇది ఎనేబుల్ చేసుకుంటే నిర్ణయించి సమయం తర్వాత దానంతటదే స్క్రీన్‌ లాక్‌ అయిపోతుంది.